కొన్ని నిర్మాణ సంస్థలకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుండి తీవ్ర ఒత్తిడి వస్తుంటుంది. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కి అదే జరుగుతుంది. సూపర్ స్టార్ మహేష్ తో ఈ సంస్థ సర్కారు వారి పాట నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అప్ డేట్స్ విషయంలో మేకర్స్ చాలా స్లో అవుతున్నారు. సూపర్ ఫ్యాన్స్ ని అప్ డేట్స్ తో సాటిస్ఫై చేయలేకపోతున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా సంస్థ ఐడీను ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇక ఈ సంస్థ నుండి జూన్ లో రాబోయే నాని సినిమా ‘అంటే సుందరానికీ’ ప్రమోషన్స్ మొదలు పెట్టి హంగామా చేయడంతో సూపర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. జూన్ లో రిలీజ్ సినిమాకు ఇప్పటి నుండే హడావుడి చేస్తున్నారు మరి మే లో రాబోతున్న మా సినిమా సంగతేంటి ? అని నేరుగా ప్రశ్నిస్తూ తమ ఆగ్రహాన్ని చూపించారు.
దీంతో మైత్రి ఇప్పుడు ఉన్నపళంగా సర్కారు వారి పాట ప్రమోషన్ మొదలు పెట్టారు. ఫ్యాన్స్ ఫైర్ అయిన వెంటనే టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈరోజు నుండి టీం ఇంటర్వ్యూస్ మొదలు పెట్టారు. నేటి నుండి సినిమాకు సంబంధించి ఎవరో ఒకరు వార్తల్లో ఉంటూ సినిమాను ప్రమోట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ కట్ కూడా రెడీ చేస్తున్నారు. మే మొదటి వారంలోనే థియేట్రికల్ ట్రైలర్ వదలనున్నారు.
ఏదేమైనా స్టార్ హీరో సినిమా అంటే నిర్మాణ సంస్థ కు ఫ్యాన్స్ నుండి ఎప్పుడూ ఏదో ఓ ఇబ్బంది ఉంటూనే ఉంటుంది మరి. ఎన్ని అప్ డేట్స్ ఇచ్చినా వారి దాహం తీర్చడం కష్టం. అనౌన్స్ మెంట్ పోస్టర్ నుండి ఇప్పటి వరకూ మధ్య మధ్యలో ఏదొకటి వదులుతూనే ఉన్నా ఇంకా ఏవి ఏవి అంటూ అడుగుతూనే ఉంటారు ఫ్యాన్స్. ఇక షూటింగ్ ఫినిష్ చేసుకున్న సర్కారు వారి పాట ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. మహేష్ ఇది మరో పోకిరి అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. మరి ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని అందుకుంటాడా ? లేదా ? అనేది మే 12 తేలిపోనుంది.
This post was last modified on April 25, 2022 11:24 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…