పుష్ప సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తుంటే.. ఎందుకీ వృథా ప్రయాస అన్నట్లే చూశారు చాలామంది. అల్లు అర్జున్‌కు డబ్బింగ్ సినిమాల ద్వారా ఉత్తరాదిన కాస్త గుర్తింపు వచ్చినంత మాత్రాన తన సినిమాను ఒకేసారి హిందీలో రిలీజ్ చేసేంత సీన్ ఉందా అని కౌంటర్లు వేశారు. అందులోనూ పుష్ప రిలీజ్ ముంగిట నార్త్ ఇండియాలో పెద్దగా ప్రమోషన్లు కూడా లేకపోవడంతో ఈ సినిమా రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి తేదేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కట్ చేస్తే పుష్ప హిందీలో సంచలనం సృష్టించింది. దాదాపు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది. అంతకంతకూ కలెక్షన్లు పెరుగుతూ పోవడం, దీని ధాటికి 83 లాంటి పెద్ద హిందీ సినిమా దెబ్బ తినడం ఎవ్వరూ ఊహించలేదు. సినిమా హిట్టవడం ఒకెత్తయితే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగులు, ఇంకా పాటలు ఉత్తరాదిన మారు మూల ప్రాంతాల్లోకి వెళ్లిపోవడం.. సెలబ్రెటీల నుంచి సామాన్యుల దాకా పుష్ప మేనియాతో ఊగిపోవడం మరో ఎత్తు.
సెలబ్రెటీలు ఎంతోమంది పుష్ప మేనరిజమ్స్, డైలాగులను అనుకరించడం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ ఆల్ టైం గ్రేట్ అమితాబ్ బచ్చన్ నోటి నుంచి కూడా పుష్ప డైలాగ్ రావడం విశేషం. బిగ్-బి నిర్వహించే కౌన్ బనేగా కరోడ్‌పతి కొత్త సీజన్‌కు సంబంధించిన ప్రోమోలో.. పుష్ప నామ్ సున్కే ఫ్లవర్ సంజే క్యా.. మై ఫ్లవర్ నహి ఫైర్.. అంటూ పుష్ప హిందీ వెర్షన్‌లో బాగా పాపులర్ అయిన డైలాగ్‌ను ఆయన ఈ ప్రోమోలో పలికారు.
అంతే కాక ఈ ప్రోమోలో పుష్ప సినిమాలో చూపించే ఎర్రచందనం దొరికే అడవులు ఏవి అంటూ ప్రశ్న అడిగి ఆప్షన్లు కూడా ఇచ్చారు. కేబీసీ కొత్త సీజన్లో పాల్గొనడానికి ఈ ప్రశ్నకు జవాబివ్వాలని కోరారు. ఇంతటి పాపులర్ షో సంబంధించిన ప్రోమోలో పుష్ప సినిమాలోని అంశంపై ప్రశ్న అడగడం.. బిగ్-బి బన్నీ డైలాగ్‌ను ఉచ్ఛరించడం.. దీన్ని బట్టి పుష్ప సినిమా నార్త్ ఇండియాలో ఏ స్థాయిలో పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on April 24, 2022 10:03 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…