ఒక పెద్ద సినిమాకు సంబంధించి ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగితే ఆ చిత్ర కథానాయిక ఆ వేడుకకు హాజరు కాలేని పరిస్థితి ఉంటే.. తన ఏవీ అయినా అందులో ప్రదర్శిస్తారు. వీడియో బైట్ ఇప్పించే ప్రయత్నం చేస్తారు. అది కూడా వీలు కానపుడు కనీసం చిత్ర బృందంలోని ముఖ్యులు కచ్చితంగా ఆమె ప్రస్తావన తెస్తారు. తను స్పందించలేని పరిస్థితి గురించి వివరణ ఇస్తారు.
కానీ ‘ఆచార్య’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కాజల్ గురించి ఎవ్వరూ ఒక్క ముక్కా మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో ప్రధాన కథానాయిక కాజలే అన్న సంగతి తెలిసిందే. ఆమె చిరంజీవికి జోడీగా నటించింది. ‘లాహే లాహే’ పాటలో ఆమె స్టెప్పులు చూశాం. ఈ చిత్ర షూటింగ్‌కు హాజరైనపుడు లొకేషన్లో కాజల్, ఆమె భర్తకు చిరు సత్కారం చేయడం గుర్తుండే ఉంటుంది.
ఇక డెలివరీకి సిద్ధమవుతున్నప్పటికీ తాను ప్రమోషన్ల కోసం వీడియో బైట్ ఇస్తానని కాజల్ అంటే.. చిరు, చరణ్ ఇలాంటి టైంలో అంత ఇబ్బంది ఎందుకంటూ వారించారని వార్తలొచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరు కానీ, చరణ్ కానీ, మిగతా ముఖ్యులెవరు కానీ కాజల్ ప్రస్తావనే తేలేదు. ఎవరో ఒకరు పేరు విస్మరిస్తే మరిచిపోయారు అనుకోవచ్చు. కానీ సినిమాలో కథానాయికగా నటించిన అమ్మాయి పేరును అందరూ విస్మరించడం సందేహాలకు తావిస్తోంది.
అసలీ సినిమాలో కాజల్ పాత్రను ఉంచారా, తీసేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘ఆచార్య’ చిత్రీకరణ ఇంకా కొంచెం మిగిలి ఉండగానే.. కాజల్ గర్భం దాల్చిన నేపథ్యంలో ఆమెపై మిగిలిన సన్నివేశాలు తీయలేని పరిస్థితుల్లో తన పాత్రను నామమాత్రంగా మార్చేశారేమో, ఆమెకు కథానాయిక స్థానం ఇవ్వలేదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన పాత్రను పక్కన పెట్టారు కాబట్టే ఆమె సినిమాలో కీలక పాత్ర పోషించిన ఫీలింగ్ రాకుండా అందరూ తన పేరును విస్మరించారేమో అన్న చర్చ నడుస్తోందిప్పుడు. కాబట్టి ‘ఆచార్య’ సినిమా చూస్తే కానీ.. కాజల్ విషయంలో టీం వ్యవహరించిన తీరుకు కారణాలేంటో అర్థం కాకపోవచ్చు.
This post was last modified on April 24, 2022 2:14 pm
``ఏపీ ప్రభుత్వం చెబుతున్న సమాచారాన్ని బట్టి.. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడం కుదరదు.…
మే 1 వచ్చేస్తోంది. అందరి చూపు నాని హిట్ 3 ది థర్డ్ కేస్ మీదే ఉంది. అంచనాలకు తగ్గట్టే…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. స్వచ్ఛంద కార్యక్రమాలలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికలకు…
సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఉండొచ్చు. కొన్నేళ్లుగా ఆమె ఫిలిం కెరీర్ కూడా డౌన్ అయిపోయి ఉండొచ్చు.…
జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే. పర్యాటకులుగా కశ్మీర్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కోసం…