కొన్ని కాంబినేషన్ సినిమాల వెనుక చాలా కథ ఉంటుంది. నిజమే ఈ సినిమా కోసమే ఇన్నేళ్ళు ఈ కాంబో కుదరలేదేమో అనిపించిన సందర్భాలు చాలానే ఉంటాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇలాగే అనిపించిందట. తెలుగు సినిమా ఇండస్ట్రీకి లెజెండ్ అనిపించుకున్న నాన్నతో నటించాలని ఏ కొడుక్కి ఉండదు. ఇలాంటి కోరికే రామ్ చరణ్ కి కూడా ఎప్పటి నుండో ఉంది. ‘మగధీర’, ‘ఖైది నంబర్ 150’, సినిమాల్లో చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ ఫుల్లెంత్ సినిమా చేయలేకపోయాడు చరణ్. ఆ కోరిక తీర్చుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది.
ఎట్టకేలకు నాన్న తో కలిసి ‘ఆచార్య’ సినిమాలో నటించాడు చరణ్. ముందుగా ఈ క్యారెక్టర్ ని తక్కువ నిడివితో రాసుకున్నాడు కొరటాల. కానీ చరణ్ సీన్ లోకి వచ్చాక ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ పెరిగింది. సీన్లు కూడా పెరిగి సినిమాలో ఆ పాత్ర సగ భాగమైంది. అయితే నాన్నతో ఈ సినిమా చెయడం ఒకెత్తయితే, షూటింగ్ లో ఇరవై రోజుల పాటు ఆయన పక్కనే ఉంటూ టైం స్పెండ్ చేయడం మరో ఎత్తు అంటూ, రోజంతా నాన్నతో గడిపిన ఆ మూమెంట్స్ ని ఎప్పుడూ పదిలంగా దాచుకుంటానని చెప్పుకున్నాడు చరణ్.
ఇక ఇదే వేదికగా రాజమౌళి గారితో సినిమా అంటే ఏ ఆర్టిస్ట్ కైనా బయటికి వెళ్లి మరో సినిమా చేసే అవకాశం ఉండదని, బహుశా అది నా ఒక్కడికే కుదిరిందని అన్నాడు చరణ్. దానికి ఉదాహరణగా బొమ్మరిల్లు సినిమా చెప్పాడు. అందులో సిద్దు చేతిని పట్టుకున్న ప్రకాష్ రాజ్ లా రాజమౌళి చేతిలోనే యాక్టర్ చేయి ఉంటుందని కానీ నాన్న కోరిక , అమ్మ కోరిక కాదనలేక ఆయన నా చేయి విడిచి పెట్టారని ఇందుకు మా అమ్మ మీకు థాంక్స్ చెప్పాలనుకుంటుంది అని రాజమౌళి గురించి చెప్పాడు చరణ్.
ఇంత వరకూ రాజమౌళి తన హీరోని ఇలా మరో సినిమా చేసుకొని రమ్మని వదిలింది లేదు. చిరు మాట కాదన లేకే జక్కన్న చరణ్ ని విడిచాడని అందరికీ తెల్సిందే. ఇక రాజమౌళి చరణ్ ని వదిలినప్పుడల్లా షూట్ చేసుకుంటూ వచ్చామని చిరు వేదిక మీదే చెప్పారు. అంటే రాజమౌళి కొన్ని కండీషన్స్ పెట్టి చరణ్ ని వదిలిపెట్టాడని ఈవెంట్ ద్వారా వ్యక్తమైంది.
This post was last modified on April 24, 2022 1:15 pm
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు…