మెగాస్టార్ చిరంజీవికి ఓ రెండు కోరికలు ఉండేవి. ఆ రెండు ఇప్పుడు ఓ వ్యక్తి వల్ల తీరిపోయాయని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ వేదికగా చిరు తన మనసులో మాటలు బయటపెట్టారు. చిరు కోరికలో మొదటిది తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి చాటి చెప్పడం. అప్పట్లో ‘రుద్రవీణ’ అవార్డు అందుకోవడం కోసం ఓ సందర్భంలో డిల్లీ వెళ్ళిన చిరు సౌత్ సినిమాని అక్కడ ఎంత చిన్న చూపు చూశారో చెప్పుకున్నారు.
తెలుగు సినిమాకి సంబంధించి ఒక్క సినిమా పోస్టర్ కూడా పెట్టలేదని అది తనని ఎంతో భాదించిందని అన్నారు. అక్కడి నుండి నేరుగా చెన్నై వచ్చి మీడియాతో ఈ విషయం చెప్పి వాపోయానని, ఓ పత్రిక తన భావాన్ని బాగా ప్రచురించారని కానీ ఎలాంటి ఫలితం రాలేదని చెప్పారు.
ఇన్నాళ్ళకి తెలుగు సినిమా , సౌత్ సినిమా అనే బేరియర్ ని చెరిపేసి ‘బాహుబలి’ ఫ్రాంచైజీతో తెలుగు సినిమాను ఇండియన్ సినిమా స్థాయికి చేర్చి రాజమౌళి నిజంగా తనను గర్వపడేలా చేశాడని, ఇప్పుడు RRR, పుష్ప , KGF గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంటే తనకి ఏంటో సంతోషంగానూ, గర్వగంగానూ ఉందని తెలిపారు చిరు.
ఈ రకంగా తన కోరిక నెరవేరిందని సభా పూర్వకంగా వెల్లడించాడు మెగా స్టార్. ఇక చిరు మరో కోరిక చరణ్ తో కలిసి ఓ ఫుల్లెంత్ సినిమా చేయడం , అది ‘ఆచార్య’తో అనుకోకుండా నెరవేరిందని చెప్పుకున్నారు. దీనికి రాజమౌళి నే కారణమని ఆయన చరణ్ ని విడిచి ఈ సినిమా చేయమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఆ కోరిక తీరేది కాదని అన్నారు. ఇక ఇద్దరం కలిసి ఓ సినిమా చేయాలనేది తన భార్య కోరిక కూడా అంటూ ఇప్పటికే ఓ సారి చెప్పుకున్న చిరు మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇలా మెగాస్టార్ మెగా కోరికలు తీరడానికి కారకుడయిన రాజమౌళిని సన్మానించి థాంక్స్ చెప్పుకున్నారు చిరు.
This post was last modified on April 24, 2022 11:51 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…