‘డీజే టిల్లు’తో ఒక్కసారిగా యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించాడు యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తోనే అతడికి మంచి గుర్తింపు వచ్చినప్పటికీ.. స్టార్ ఇమేజ్ వచ్చిందైతే ‘డీజే టిల్లు’తోనే. యూత్‌లో ఈ సినిమాతో అతడికి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఐతే ఈ సినిమా వల్ల ఇమేజ్ మారిపోవడంతో ఆల్రెడీ ఒప్పుకుని, షూటింగ్ కూడా చేస్తున్న ఓ సినిమా నుంచి సిద్ధు తప్పుకుని ఆ చిత్ర దర్శక నిర్మాతలకు పెద్ద షాక్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ ‘కప్పెల’కు రీమేక్. ‘డీజే టిల్లు’ను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది. సుకుమార్ దగ్గర చాలా ఏళ్ల నుంచి పని చేస్తున్న రమేష్ అలియాస్ శౌరీ చంద్రశేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో కథానాయికగా అనైకా సురేంద్రన్ నటిస్తోంది. మలయాళంలో అనా బెన్ పోషించిన పాత్ర ఇది.
హీరోయిన్ ఓరియెడెంట్ మూవీ అయిన ‘కప్పెలా’లో కథానాయికను మించి హైలైట్ అయ్యే ఒక పాత్ర ఉంటుంది. అక్కడ ఆ పాత్రను రోషన్ ఆండ్రూస్ చేశాడు. ఇది డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర ఇది. ఆ పాత్ర తాలూకు ట్విస్ట్ చూసి చివర్లో షాక్ అయిపోతాం. తెలుగులో ఈ పాత్రకు సిద్ధు జొన్నలగడ్డను తీసుకున్నారు. ఈ చిత్రానికి ఓకే చెప్పే సమయానికి తన పాత్ర విషయంలో అతడికి అభ్యంతరాలేమీ లేకపోయాయి. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఆ పాత్రకు సిద్ధు బాగా సూటవుతాడు కూడా.
కానీ ఇప్పుడు ‘డీజే టిల్లు’తో తన ఇమేజ్ మారిపోవడంతో సిద్ధు ఈ పాత్ర విషయంలో పునరాలోచనలో పడ్డాడట. నిజానికి ఇప్పుడు చేసినా అతడికి ఆ పాత్ర వైవిధ్యంగానే ఉంటుంది. ప్రేక్షకులు అది చూసి కచ్చితంగా షాకవుతారు. సినిమాకు అతను పెద్ద ప్లస్ అవుతాడు కూడా. కానీ సిద్ధు ఆలోచన మరోలా ఉంది. మారిన తన ఇమేజ్‌కు ఈ పాత్ర సూటవ్వదని భావించి కొన్ని సన్నివేశాల్లో నటించాక ఇప్పుడు సినిమా చేయలేనని చెప్పి తప్పుకున్నాడట. దీంతో సినిమా అర్ధంతరంగా ఆగినట్లు తెలుస్తోంది. దర్శక నిర్మాతలు షాక్‌కు గురై.. ఇక చేసేది లేక ఆ పాత్ర కోసం వేరే నటుడిని చూస్తున్నారట.
This post was last modified on April 23, 2022 4:44 pm
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
టీడీపీ సీనియర్ నాయకురాలు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత… రాజకీయంగా చర్చనీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి…
గేమ్ ఛేంజర్ ఇంకా విడుదలే కాలేదు రామ్ చరణ్ అప్పుడే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించేశాడు. సుకుమార్ ప్రియ శిష్యుడు…