తెలుగులో క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న నాని జెర్సీ మూవీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌ను రూపొందించిన గౌతమ్ తిన్ననూరినే హిందీలోనూ డైరెక్ట్ చేశాడు. దిల్ రాజు, నాగవంశీ కలిసి అమన్ గిల్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. కరోనా, ఇతర కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ముందే సెలబ్రెటీలకు ప్రిమియర్ వేశారు. అక్కడ మంచి టాక్ వచ్చింది. ఈ రోజు సమీక్షకులు, ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. కానీ ఈ టాక్‌కు తగ్గట్లుగా కలెక్షన్లు మాత్రం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే జెర్సీ అంచనాలను అందుకోలేదు. తొలి రోజు కలెక్షన్లు కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు.
తొలి రోజు ఇండియాలో జెర్సీ రూ.4 కోట్లకు మించి నెట్ వసూళ్లు సాధించే పరిస్థితి లేదన్నది ట్రేడ్ పండిట్ల మాట. వారం ముందు రిలీజైన కన్నడ అనువాద చిత్రం కేజీఎఫ్-2కేమో శుక్రవారం రూ.12 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అంటే ఒక బాలీవుడ్ స్టార్ నటించిన కొత్త హిందీ మూవీ కంటే.. పాత డబ్బింగ్ మూవీకి మూడు రెట్లు వసూళ్లు ఎక్కువ అన్నమాట.
దీన్ని బట్టి హిందీ ప్రేక్షకుల అభిరుచి ఎంతగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వాళ్లకు ఇప్పుడు మంచి మాస్, యాక్షన్ సినిమాలు కావాలి. అవి సౌత్ ఇండస్ట్రీనే అందిస్తోంది. బాలీవుడ్లో వచ్చే క్లాస్ సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అక్కడి ప్రేక్షకులు. ఈ క్రమంలోనే జెర్సీకి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. తొలి రోజు ఆ ప్రభావం వసూళ్ల మీద బాగానే పడింది. మరి పాజిటివ్ టాక్‌ను సద్వినియోగం చేసుకుని సినిమా వీకెండ్లో పుంజుకుంటుందేమో చూడాలి.
This post was last modified on April 23, 2022 6:33 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…