మన వాళ్లకు విఘ్నేష్ శివన్ అంటే నయనతార బాయ్ ఫ్రెండ్‌గానే తెలుసు. తమిళంలో దర్శకుడిగా అతడికి మంచి పేరే ఉంది. శింబు-వరలక్ష్మి శరత్ కుమార్ జంటగా నటించిన పోడా పోడి అనే హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అతను.. ఆ తర్వాత విజయ్ సేతుపతి-నయనతార కలయికలో తెరకెక్కించిన నానుమ్ రౌడీదా సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఈ చిత్రం నేనూ రౌడీనే పేరుతో తెలుగులో కూడా అనువాదమైంది.
ఆ తర్వాత అతను సూర్య హీరోగా గ్యాంగ్ సినిమా తీశాడు. ఇది ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత అతను తెరకెక్కించిన చిత్రమే.. కాదువాతుల రెండు కాదల్. షార్ట్‌గా కేఆర్‌కే అని పిలుస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కణ్మణి రాంబో ఖటీజాగా అనువదిస్తున్నారు. ఈ నెల 28న సినిమా రిలీజవుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఆద్యంతం భలే ఎంటర్టైనింగ్‌గా సాగింది.
ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయితో రొమాన్స్ చేసి.. ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలిశాక కూడా ఇద్దరితోనూ కలిసి ఉండాలని కోరుకునే కుర్రాడి కథ ఇది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఫన్నీగా డీల్ చేసినట్లున్నాడు విఘ్నేష్. ఖుషి సినిమాలో ఆరిపోతున్న దీపానికి చేతులు అడ్డు పెట్టే క్రమంలో హీరో హీరోయిన్లు తొలిసారి కలుసుకునే సన్నివేశం ఎంత పాపులరో తెలిసిందే.
ఇందులో దాన్ని పేరడీ చేశారు. హీరోతో పాటు ఇద్దరు హీరోయిన్లు వచ్చి దీపాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఫన్నీ షాట్లు ట్రైలర్లో చాలానే ఉన్నాయి. లీడ్ ఆర్టిస్టులు ముగ్గురూ మంచి పెర్ఫామర్లు కావడం, విఘ్నేష్ శివన్ మార్కు రొమాన్స్, కామెడీ బాగా వర్కవుట్ కావడంతో సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం మరో ఆకర్షణ.
This post was last modified on April 23, 2022 6:28 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…