కరోనా క్రైసిస్ వల్ల నాని ప్లానింగ్ కాస్త దెబ్బ తింది. పక్కా ప్రణాళికతో ఏది చేసినా రిలీజ్ డేట్ తో సహా ముందు ప్లాన్ చేసుకునే నాని ‘వి’ సినిమానే ఇంకా విడుదల కాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన ఆ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. టక్ జగదీష్ షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది కనుక ముందుగా అది పూర్తి చేస్తాడు.
ఆ తర్వాత నాని వేసుకున్న ఆర్డర్ లో శ్యామ్ సింగ రాయ్ చేయాలి. అది కాస్త ఎక్కువ బడ్జెట్ సినిమా కనుక వాయిదా వేస్తారనే రూమర్స్ వినిపించాయి. కానీ నాని ఆర్డర్ మిస్ అవడం లేదు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్నే టక్ జగదీష్ తర్వాత చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నారు.
ఇప్పటికే ఒక కథానాయికగా సాయి పల్లవి ఓకే కాగా, మరో పాత్రకు రష్మిక పేరు పరిశీలనలో ఉంది. టక్ జగదీష్ షూట్ పూర్తి కాగానే ఈ చిత్రాన్ని మొదలు పెట్టి వచ్చే వేసవిలో విడుదల చేసేలా నిర్మాత నాగవంశీ ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. నాని వేరే కథలు విన్నా కానీ అవి ఈ చిత్రం పూర్తయిన తర్వాతే ఉంటాయన్నమాట. మరి ఈ చిత్రం బడ్జెట్ పరంగా ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయో లేదో ఇంకా తెలియదు.
This post was last modified on June 22, 2020 10:28 pm
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…