తమిళంలో కాస్త పేరు తెచ్చుకున్న ఏ సంగీత దర్శకుడైనా తెలుగులో సినిమా చేయాల్సిందే. అక్కడి నుంచి టెక్నీషియన్లను అరువు తెచ్చుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే. ఇళయరాజా దగ్గర్నుంచి అనిరుధ్ వరకు ప్రతి తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో సినిమాలు చేశారు. ఐతే ఏఆర్ రెహమాన్ కెరీర్ స్పాన్‌ను బట్టి చూస్తే తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. నిప్పురవ్వ, సూపర్ పోలీస్, రక్షకుడు, ఏమాయ చేసావె, కొమరం పులి, సాహసం శ్వాసగా సాగిపో.. ఇలా 30 ఏళ్ల వ్యవధిలో రెహమాన్ తెలుగులో చేసిన సినిమాలను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు.
ఇందులో ఏమాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలను డైరెక్ట్ తెలుగు సినిమాలుగా కూడా చెప్పలేం. ‘రక్షకుడు’, ‘కొమరం పులి’ చిత్రాలను తీసింది తమిళ దర్శకులు కాబట్టి చేశాడు తప్ప వేరే కారణం లేదు. ఈ లెక్కన సంగీత దర్శకుడిగా ఒక స్థాయిని అందుకున్నాక ఒక తెలుగు దర్శకుడితో తెలుగు సినిమాకు రెహమాన్ పని చేయలేదని చెప్పాలి. ఆ మధ్య ‘సైరా’ సినిమాకు రెహమానే ముందుగా సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయినప్పటికీ.. తర్వాత ఆయన ఈ చిత్రం నుంచి ఏవో కారణాలతో తప్పుకున్నారు.
ఐతే చాలా గ్యాప్ తర్వాత రెహమాన్ ఓ అచ్చ తెలుగు సినిమాకు సంగీతం అందించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందించనున్న చిత్రానికి రెహమాన్ పని చేయనున్నాడట. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో సినిమా ఓకే చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని, ‘పెద్ది’ అనే టైటిల్ కూడా ఖరారైందని వార్తలొస్తున్నాయి. కాగా ఇటీవల బుచ్చిబాబు రెహమాన్ అసిస్టెంట్లతో సమావేశం కావడం, దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన సంగీత చర్చల్లో భాగంగానే ఇది జరిగినట్లుగా తెలుస్తోంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మల్టిపుల్ ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్న రెహమాన్.. తన టీంను సంగీత చర్చల కోసం బుచ్చిబాబు దగ్గరికి పంపి ఉండొచ్చేమో. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రెహమాన్ పని చేయడం దాదాపు ఖాయం అంటున్నారు. ఇంతకుముందు తారక్ ‘నాగ’ సినిమాకు ముందు రెహమాన్‌నే సంగీత దర్శకుడిగా అనుకున్నారు. తర్వాత విద్యాసాగర్ ఓకే అయ్యాడు. ఐతే ఇప్పుడు మాత్రం తారక్-రెహమాన్ కాంబో గ్యారెంటీ అంటున్నారు. చూడాలి ఏమవుతుందో?
This post was last modified on %s = human-readable time difference 5:55 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…