కీర్తి సురేష్ కెరీర్‌ను ‘మహానటి’కి ముందు, ‘మహానటి’కి తర్వాత అని విభజించి చూడాలి. ఆ సినిమా ముందు వరకు ఆమెను మంచి నటిగా ఎవరూ గుర్తించలేదు. కానీ ‘మహానటి’తో ఒక్కసారిగా అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. ఈమెలో ఇంత గొప్ప నటి ఉందా అనిపించింది. ఆ చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుందామె. ఐతే ‘మహానటి’ తర్వాత తనపై భారీగా పెరిగిన అంచనాలను కీర్తి అందుకోలేకపోయింది.
పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తోడు కీర్తి నటించిన వేరే చిత్రాల్లో కూడా తన పాత్రలు క్లిక్ కాలేదు. వరుసగా ఆమెకు పరాజయాలు తప్పలేదు. ఐతే తమిళంలో ఆమె నటిస్తున్న ‘సాని కాయిదం’ సినిమా మాత్రం కీర్తి ఈజ్ బ్యాక్ అనిపిస్తుందనే అంచనాలు రేకెత్తించింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ చూసినపుడే అందరూ షాకైపోయారు. దర్శకుడు సెల్వ రాఘవన్ మరో కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో.. వీళ్లిద్దరూ హత్యలు చేసే కిల్లర్లుగా కనిపించడం విశేషం. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ కాబోతున్న ‘సాని కాయిదం’ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
ఇదొక రివెంజ్ డ్రామా అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటి అని చెబుతూ రాయితో కొడితే తిరిగి రాయితో కొడతాం.. మన మీద ఉమ్మేస్తే తిరిగి ఉమ్మేస్తాం.. కానీ ఒకడు మన వాళ్లను చంపి మన జీవితాల్ని నాశనం చేశాక అతను జైలుకు వెళ్తే ప్రతీకారం తీరినట్లు ఎలా అవుతుంది అంటూ.. కీర్తి ప్రశ్నించడం.. తర్వాత కీర్తి ఓ వ్యక్తిని నిలువునా తగలబెడుతుండటం కనిపించింది.
ఈ ప్రతీకారంలో సెల్వ రాఘవన్‌కు కూడా భాగం ఉన్నట్లు చూపించారు. ఐతే కీర్తికి, సెల్వకు ఉన్న సంబంధమేంటన్నది తెర మీదే చూడాలి. టీజర్ అయితే బాగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి కీర్తి గత చిత్రాలకు భిన్నమైన రెస్పాన్స్ ఈ చిత్రానికి వస్తుందేమో చూడాలి. మే 6న తమిళంతో పాటు మరి కొన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ‘రాకీ’ అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే ఆకట్టుకున్న అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
This post was last modified on April 22, 2022 1:31 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…