నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ‘అంటే సుందరానికీ’ అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘బ్రోచేవారెవరురా’ దర్శకుడు వివేక్ ఆత్రేయతో నాని జట్టు కట్టడం, ‘అంటే సుందరానికీ’ అనే వెరైటీ టైటిల్ పెట్టడం, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా రిలీజ్ చేసే ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ రోజు లాంచ్ చేసిన టీజర్ మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నాని ఫ్యాన్స్ అయితే టీజర్‌కు ఫిదా అయిపోయారు. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అన్న ఆత్రంతో ఉన్నారు. ఆద్యంతం ఆకట్టుకున్న టీజర్.. జూన్ 10న ఒక ఫన్ రైడ్ చూడబోతున్న ఫీలింగ్ కలిగించింది. ఐతే టీజర్లో మిగతా విషయాలన్నీ ఒకెత్తయితే.. చివర్లో సస్పెన్స్‌గా ఉంచిన పాయింట్ మరో ఎత్తు. ప్రేక్షకులను గెస్సింగ్‌లో ఉంచుతూ.. చెప్పుకోండి చూద్దాం అన్నట్లుగా దీన్ని ముగించాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ.ఇందులో హీరోకు ఏదో పెద్ద సమస్యే ఉందన్నట్లుగా హింట్ ఇచ్చారు టీజర్లో.
దాని గురించి చెప్పడానికి నాని ఇబ్బంది పడుతూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ హైలైట్. ఈ సీన్ చూసిన వారికి సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘ఏక్ మిని కథ’ గుర్తొచ్చి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. అందులో కూడా హీరో ఇలాగే ఇబ్బంది పడతాడు. పైగా అతను ఇబ్బంది పడేటపుడు ఎదురుగా ఉండే వ్యక్తి హర్షవర్ధన్. అతనే ‘అంటే సుందరానికీ’లోనూ నాని ముందు కనిపించడం యాదృచ్ఛికం. ఇందులో ఉన్న సమస్య లైంగిక సంబంధమైనదా అనే డౌట్లు వచ్చేలా ఈ టీజర్‌ను ముగించడం గమనార్హం. మామూలుగా ‘సుందరానికి తొందరెక్కువ’ అనే మాట బాగా పాపులర్ అన్న సంగతి తెలిసిందే.
టైటిల్ దీనికి దగ్గరగా పెట్టడంతో హీరోకు శీఘ్రస్ఖలన సమస్య ఏమైనా ఉంటుందా.. దాని నేపథ్యంలో వినోదాత్మకంగా సినిమాను తీర్చిదిద్దారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఒకప్పుడైతే ఇలాంటి కాన్సెప్ట్ తెరపై చూపించడానికి దర్శకులు, చూడటానికి ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడిపోయేవారు కానీ.. ఇప్పుడు రోజులు మారాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీదే వివేక్ ఆత్రేయ వినోదం పండిస్తున్నాడేమో చూడాలి.
This post was last modified on April 20, 2022 1:55 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…