తమిళం అనే కాదు.. మొత్తంగా దక్షిణాది సినీ చరిత్రలోనే చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కమెడియన్లలో వడివేలు ఒకరు. తమిళ అనువాద చిత్రాల ద్వారా మన వాళ్లు కూడా వడివేలు కామెడీని బాగా ఎంజాయ్ చేసేవాళ్లు ఒకప్పుడు. ఐతే దాదాపు రెండు దశాబ్దాలు తమిళ కామెడీని ఏలిన వడివేలు.. తర్వాత డౌన్ అయిపోయారు. గత దశాబ్ద కాలంలో ఆయన చాలా తక్కువ సినిమాలు చేశారు. ఒక టైంలో అనవసరంగా రాజకీయాల్లో వేలు పెట్టి బాగా ఇబ్బంది పడ్డారు వడివేలు.
దీనికి తోడు శంకర్ నిర్మాణంలో చేయాల్సిన పులకేసి-2 సినిమా విషయంలో వివాదం కూడా ఆయన కెరీర్‌ను దెబ్బ తీసింది. ఇప్పుడాయన మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వడివేలు కథానాయకుడిగా నాయిశేఖర్ రిటర్న్స్ అనే సినిమా తెరకెక్కుతుండటం విశేషం. సూరజ్ అనే పేరున్న దర్శకుడే ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
గతంలో దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో తాను రూపొందించిన ఓ సినిమాలో సూపర్ క్లిక్ అయిన నాయిశేఖర్ అనే పాత్రనే తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు సూరజ్.
ఈ సినిమాలో వడివేలు మీద ఒక మంచి డ్యాన్స్ నంబర్ కూడా పెడుతున్నారు. ఆ పాటకు లెజెండరీ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా నృత్య రీతులు సమకూర్చడం విశేషం. ఒకప్పుడు సౌత్ ఇండియాలో టాప్ హీరోలందరికీ డ్యాన్స్ కంపోజింగ్ చేసి గొప్ప పేరు సంపాదించిన ప్రభుదేవా తర్వాత హీరోగా బిజీ అయి డ్యాన్స్ కంపోజింగ్ తగ్గించేశాడు.
దర్శకుడిగా మారాక అయితే పూర్తిగా ఆ పనికి దూరం అయ్యాడు. రౌడీ బేబీ లాంటి పాటలు ఒకటీ అరా మాత్రమే కంపోజ్ చేశాడు. అలాంటి డ్యాన్స్ మాస్టర్ కమెడియన్ వడివేలు సినిమాలో పాటకు డ్యాన్స్ కంపోజింగ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. వడివేలు కామెడీ ఇమేజ్‌కు తగ్గట్లే ప్రభుదేవా వెరైటీగా స్టెప్పులేయించి ఉంటాడనడంలో సందేహం లేదు. ఈ పాటతోనే సినిమాకు మంచి హైప్ రావడం గ్యారెంటీ.
This post was last modified on %s = human-readable time difference 7:18 am
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…