కన్నడ సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని భారీ వసూళ్లను కేజీఎఫ్-2 సొంతం చేసుకుంటుంటే.. ఆ చిత్ర హీరోకు వచ్చిన కష్టమేంటి అనిపిస్తోందా? అయితే ఇది అతడి భవిష్యత్తకు సంబంధించిన విషయంలెండి. కన్నడ సినిమాలు కర్ణాటక దాటి రిలీజవడమే గగనం అంటే.. మూడున్నరేళ్ల కిందట కేజీఎఫ్ దేశవ్యాప్తంగా అలాంటిలాంటి సంచలనం రేపలేదు. ఇప్పుడు చాప్టర్-2 అంతకుమించిన విజయం అందుకుంటోంది. ఈ చిత్రంతో యశ్ ఇమేజే మారిపోయింది. దేశవ్యాప్తంగా అతడి క్రేజ్ మామూలుగా లేదు. కానీ ఈ సినిమాతో వచ్చే ఇమేజ్, ఫాలోయింగ్, మార్కెట్‌ను అతను ఎంతమేర ఉపయోగించుకుంటాడన్నదే ఇప్పుడు సందేహంగా మారింది.
ప్రశాంత్ కాకుండా అతడి ఇమేజ్‌ను సరిగ్గా ఉపయోగించుకుని, తన స్థాయికి తగ్గ సినిమాను అందించే దర్శకుడెవరూ శాండిల్‌వుడ్‌లో కనిపించడం లేదు. యశ్‌కు కేజీఎఫ్ స్థాయి హిట్ పడాలంటే మళ్లీ ప్రశాంతే అతడితో సినిమా తీయాలి. కానీ ప్రశాంత్ సలార్, ఎన్టీఆర్ సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. ఆ తర్వాత మరి కొందరు టాలీవుడ్ సూపర్ స్టార్లు తనతో సినిమా కోసం ట్రై చేస్తున్నారు. కాబట్టి రాబోయే కొన్నేళ్లలో ప్రశాంత్.. యశ్‌తో సినిమా చేసే ఛాన్స్ లేదు. కేజీఎఫ్‌కు సరితూగే సినిమా కాదు కదా.. దానికి దరిదాపుల్లో నిలిచే సినిమా తీసే దర్శకుడు కూడా ఎవరూ కన్నడలో కనిపించడం లేదు.
మరి టాలీవుడ్ స్టార్ దర్శకులెవరైనా అతడితో సినిమాలు చేస్తారా అంటే అందరూ బిజీనే. వారికి ఇక్కడ చాలా కమిట్మెంట్లు ఉన్నాయి. మరి యశ్‌కు బాలీవుడ్‌కు వెళ్లి అక్కడి దర్శకులతో సినిమాలు చేస్తాడా అన్నదీ సందేహమే. టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉండి కూడా ప్రభాస్ బాహుబలి తర్వాత తన కెరీర్‌ను సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాడు. తర్వాతి రెండు సినిమాలతో దెబ్బ తిన్నాడు. అలాంటిది కన్నడలో ప్రశాంత్ కాకుండా యశ్ ఇమేజ్‌ను సరిగ్గా ఉపయోగించుకునే దర్శకుడే కనిపించకపోవడం అతడికి మైనస్సే.
This post was last modified on April 18, 2022 8:50 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…