ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఊరికే అనరు. మన టైం నడుస్తోంది కదా అని అతి చేస్తే ఈ సోషల్ మీడియా కాలంలో జనాలు ఆ టైం ఎప్పుడు తిరగబడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు పూజా హెగ్డేకు ఇలాగే టైం తిరగబడడంతో ఆమెను యాంటీ ఫ్యాన్స్ ఒక ఆట ఆడేసుకుంటున్నారు. దాదాపు అన్ని ఇండస్ట్రీల్లోనూ పూజాకు కెరీర్ ఆరంభంలో ఫ్లాపులే ఎదురయ్యాయి.
ఐతే తెలుగులో డీజే సినిమాతో ఆమె దశ తిరిగింది. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా.. పూజా గ్లామర్ ఎటాక్‌తో అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత వరుసగా పెద్ద పెద్ద అవకాశాలు వచ్చాయి. దీంతో ఇక ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఐతే తన రేంజి మారిపోవడంతో పూజాకు పొగరు తలకెక్కిందనే అభిప్రాయం జనాలకు కలిగేలా చేసిందామె.
ఓ సినిమాలో సమంత లుక్ గురించి ఆమె కామెంట్ చేయడం, తర్వాత సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయినట్లు కవర్ చేయడం గుర్తుండే ఉంటుంది. ఇక రాధేశ్యామ్ టైంలో ప్రభాస్ దగ్గరా యాటిట్యూడ్ చూపించిందనే వార్తలొచ్చాయి. అలాగే ట్విట్టర్లో చిట్ చాట్‌ల సందర్భంగా కూడా పూజా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె పట్ల వ్యతిరేకత పెంచుకున్న వాళ్లంతా కాచుకుని ఉన్నారు. నెల కిందటే రాధేశ్యామ్ ఫ్లాపవడం.. తాజాగా బీస్ట్ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆమెను ట్విట్టర్లో ఆటాడేసుకుంటోంది ఈ బ్యాచ్.
ముఖ్యంగా బీస్ట్ రిలీజ్‌కు ముందు ఆమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా చూస్తే సినిమాలో ఆమెకు పెద్దగా రోల్ లేదు. అరబిక్ కుత్తు పాటను తీసేస్తే ఆమె సినిమాలో ఉన్నట్లు కూడా అనిపించదు. దీనికి తోడు సినిమా కూడా తుస్సుమనిపించడంతో పూజాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వరుసగా రెండు పెద్ద సినిమాలు తేడా కొట్టడం పూజా కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపించేలాగే కనిపిస్తోంది. ఆమె చేతిలో ప్రస్తుతం మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలున్నాయి.
This post was last modified on April 18, 2022 8:33 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…