థియేటర్లు తెరిచే వరకు వేచి చూద్దామా.. లేక ఎంత వస్తే అంత వచ్చింది అని ఏదైనా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో డీల్ కుదుర్చుకుని సినిమాను ఆన్ లైన్లో రిలీజ్ చేసేద్దామా.. ఇదీ ఇప్పుడు టాలీవుడ్ ప్రొడ్యూసర్ అయోమయం.
సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో చిన్న సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేయడమే మంచిదన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. థియేటర్లలోకి వచ్చినా పెద్దగా రెవెన్యూ రాకపోవచ్చనుకునే, థియేటర్లు పెద్దగా దొరికే అవకాశం లేదు అనుకునే సినిమాలను ఇలాగే ధైర్యం చేసి ఓటీటీల్లో వదిలేస్తున్నారు.
ఈ విషయంలో మిగతా పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ కొంచెం వెనుకంజలోనే ఉంది. ఇప్పటిదాకా ‘అమృతారామమ్’ అనే చిన్న సినిమా మాత్రమే ఓటీటీలో రిలీజైంది. సత్యదేవ్ సినిమాలు ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’, ‘47 డేస్’ ఓటీటీ రిలీజ్‌కు లైన్లో ఉన్నాయి.
ఈ వరుసలో చేరే సినిమాలేవా అని చూస్తున్నారంతా. సురేష్ ప్రొడక్షన్స్ వారి ‘కృష్ణ అండ్ హిస్ లీల’ ఇలాగే రిలీజ్ కాబోతోందని ఈ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడీ విషయం ఖరారైంది. తాజాగా ఈ చిత్ర కథానాయికల్లో ఒకరైన శ్రద్ధ శ్రీనాథ్ తమ చిత్రం ఓటీటీలోనే రిలీజ్ కాబోతోందని సంకేతాలిచ్చింది. ‘కమింగ్ టు యువర్ డివైజెస్ సూన్’ అంటూ ఆమె ఈ సినిమా గురించి ఒక ట్వీట్ వేసింది. దీన్ని బట్టి సినిమాను టీవీలు, కంప్యూటర్లు, మొబైళ్లలో చూసుకోవచ్చన్నమాట.
‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు హీరోగా నటించిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’ను ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేశఆడు. శ్రద్ధతో పాటు షాలిని వడ్నికట్టి అనే అమ్మాయి ఇందులో మరో కథానాయికగా నటించింది. సిద్ధు, రవికాంత్ కలిసి ఈ చిత్రానికి స్క్రిప్టు రాయడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 ఈ చిత్రాన్ని నిర్మించింది. అంతా బాగుంటే మే 1న రిలీజవ్వాల్సిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది.
This post was last modified on June 22, 2020 10:13 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…