Movie News

సుక్కు కూడా ఆ తప్పు చేస్తాడా?

కేజీఎఫ్-2 భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలివేషన్ల విషయంలో, భారీతనంలో, విజువల్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ఈ సినిమా ‘కేజీఎఫ్-1’ కంటే కొన్ని మెట్లు పైనే ఉందని చెప్పాలి. వాటి వరకు ఓ వర్గం ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. కానీ అందరు ప్రేక్షకులూ ఇలా ఉండరు. కేవలం ఎలివేషన్లు చూసి ఆహా ఓహో అనేయరు.

ఆ ఎలివేషన్లకు ముందు బలమైన సన్నివేశాలు ఉండాలని, కథ పకడ్బందీగా ఉండాలని, కథనంలో ఆసక్తి ఉండాలని ఆశిస్తారు. ఈ విషయాల్లో ‘కేజీఎఫ్-2’ నిరాశకే గురి చేసింది. ‘కేజీఎఫ్-చాప్టర్ 1’లో ఇవన్నీ ఉంటాయి. చెప్పుకోవడానికి అందులో చాలా కథ ఉంటుంది.

రాకీ అనామకుడిగా ప్రయాణం మొదలుపెట్టి కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునే వరకు ఒక జర్నీ ఉంటుంది. అందులో ఒక ఎమోషన్ ఉంటుంది. కానీ ‘కేజీఎఫ్-2’లో చెప్పుకోవడానికి కథ పెద్దగా ఉండదు. ఆల్రెడీ కేజీఎఫ్ సామ్రాజ్యం రాకీ సొంతమై ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అంతగా కిక్ ఉండదు.

సినిమాకు ముందు నుంచి ఉన్న హైప్ వల్ల భారీగా ఓపెనింగ్స్ వస్తున్నాయి కానీ.. వీకెండ్ తర్వాత సినిమా ఏమాత్రం నిలబడుతుందో చూడాలి. సినిమా విషయంలో ప్రేక్షకులు పూర్తి సంతృప్తితో లేరన్నది మాత్రం స్పష్టం. ఈ విషయం ‘పుష్ప’ టీం గుర్తిస్తే మంచింది. ‘కేజీఎఫ్-2’ తర్వాత ‘పుష్ప’ మీద కూడా ఇదే తరహాలో భారీ అంచనాలుంటాయి.

మంచి హైప్ రావడం గ్యారెంటీ. ఐతే ఆ హైప్‌ను నమ్ముకుంటే సరిపోదు. ‘కేజీఎఫ్-2’కు బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొచ్చాయి కాబట్టి సరిపోయింది. రిలీజ్ టైమింగ్ కుదరక, గట్టి పోటీ ఉంటే కథ వేరుగా ఉంటుంది. కాబట్టి సుకుమార్ కచ్చితంగా కథాకథనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కథ పరంగా ‘పుష్ప’కు, ‘కేజీఎఫ్’కు కూడా కొన్ని పోలికలున్నాయి.

దాని మాదిరే ఫస్ట్ పార్ట్‌లో హీరో అనామకుడిగా అడుగు పెట్టి పెద్ద సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. దాన్ని నిలబెట్టుకోవడానికి సెకండ్ పార్ట్‌లో పోరాటం ఉండొచ్చు. కానీ అక్కడ ‘కేజీఎఫ్-2’ తరహాలో ఎలివేషన్లతో లాగించేస్తే కుదరదు. కథ పరంగా మలుపుండాలి. కథనంలో ప్రత్యేకత కనిపించాలి. ప్రశాంత్ చేసిన తప్పు సుకుమార్ చేయకుండా తనదైన శైలిలో పకడ్బందీ కథాకథనాలతో మెప్పిస్తాడేమో చూద్దాం.

This post was last modified on April 17, 2022 8:27 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

2 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

3 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

4 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

5 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

5 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

5 hours ago