నేచురల్ స్టార్ నాని కేవలం నటనకు పరిమితం అయిపోకుండా.. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతను చాలా ఏళ్ల కిందట ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించాడు. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే ఆ తర్వాత పూర్తి స్థాయి నిర్మాతగా మారి కొన్నేళ్ల కిందట ‘అ!’ సినిమాను నిర్మించాడు నాని. ఆ సినిమా వియర్శల ప్రశంసలు.. సంతృప్తినిచ్చే స్థాయిలో కాసులు.. వాటితో పాటు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది.
ఈ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ మీద సందేహాలు ఉన్న వాళ్లందరికీ ఆ మధ్య ఒకసారి క్లారిటీ ఇచ్చాడు నాని. బాక్సాఫీస్ లెక్కల్లో చెప్పాలంటే ఆ సినిమా సూపర్ హిట్ అని అతను తీర్మానించాడు. ఐతే అంత మంచి ఫలితాన్నిచ్చినప్పటికీ ‘అ!’కు సీక్వెల్ తీయడానికి మాత్రం నాని ముందుకు రాలేదు. నాని పక్కకు తప్పుకోవడంతో వేరే నిర్మాతల కోసం ఎదురు చూసి.. చివరికి ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు గత ఏడాది ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
‘అ!’ తర్వాత శైలేష్ కొలను అనే మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ‘హిట్’ అనే సినిమా తీశాడు నాని. ఆ సినిమా నానికి మరింత మంచి ఫలితాన్నే అందించింది. లాక్‌డౌన్‌తో థియేటర్లు షట్ డౌన్ కావడానికి ముందు టాలీవుడ్ చివరి హిట్ ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతోందని సినిమా చివర్లో స్పష్టంగా చెప్పేశారు. తర్వాత దర్శకుడు శైలేష్ కొలను, హీరో విశ్వక్సేన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
ఐతే నాని ఈ సీక్వెల్‌ను నిర్మించట్లేదని, శైలేష్ వేరే నిర్మాతకు ఈ సినిమా చేస్తున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని అంటున్నాడు శైలేష్. తాజాగా ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడిన శైలేష్.. తన తర్వాతి సినిమా ‘హిట్-2’నే అని.. దాన్ని నానీనే నిర్మిస్తున్నాడని స్పష్టత ఇస్తున్నాడు. మరి ప్రశాంత్‌కు హ్యాండిచ్చిన నాని.. శైలేష్‌తో సీక్వెల్ చేయడానికి అతడిలో ఏం నచ్చిందో చూడాలి. చూస్తుంటే ‘హిట్’ సిరీస్‌లో ఎన్ని సినిమాలొస్తే అన్నీ నానీనే నిర్మించేట్లుంది.
This post was last modified on June 22, 2020 1:50 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…