‘కేజీఎఫ్-2’ మీద అంచనాలు భారీగా ఉన్నాయని తెలుసు. కానీ మరీ ఈ స్థాయిలో జనాలు ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని, ఇంతలా ఎగబడతారని ట్రేడ్ పండిట్లు కూడా అంచనా వేయలేకపోయారు. అందరి అంచనాలను మించిపోయి ఆ చిత్రం తొలి రోజు సంచలన రీతిలో కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమాకు డే-1 వచ్చిన రెస్పాన్స్, వసూళ్లు చూసి ఒక్కొక్కరికి దిమ్మదిరిగిపోతోంది.
ముఖ్యంగా బాలీవుడ్ జనాలకైతే ఇది మామూలు షాక్ కాదు. తమ మార్కెట్‌ను వరుసగా సౌత్ సినిమాలు కొల్లగొట్టేస్తుండటం.. తమ చిత్రాలను వెనక్కి నెట్టి బాక్సాఫీస్‌ను రూల్ చేస్తుండటం.. వాటికి పోటీగా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి భయపడే పరిస్థితి రావడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే వారిలో నెలకొన్న ఆందోళన ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటుందనడంలో సందేహం లేదు. సౌత్ నుంచి వచ్చే మాస్ సినిమాల కోసం నార్త్ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పడానికి ఇది రుజువు.
‘కేజీఎఫ్-2’కు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, వస్తున్న ఓపెనింగ్స్ కచ్చితంగా ‘పుష్ప’ టీంను ఉత్కంఠకు గురి చేస్తుంటాయి. గత ఏడాది చివర్లో ‘పుష్ప’ నార్త్ బాక్సాఫీస్‌లో ఎలా ప్రకంపనలు రేపిందో తెలిసిందే. ‘కేజీఎఫ్-1’ లాగే పెద్దగా అంచనాల్లేకుండా రిలీజై దాదాపు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించిందా సినిమా.
పుష్పలో హీరో మేనరిజమ్స్, పాటలు ఉత్తరాదిన మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లిపోయాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ‘పుష్ప’ మేనియాతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ మీద అంచనాలు ఏ స్థాయికి వెళ్తాయో చెప్పాల్సిన పని లేదు. దీనికొచ్చే బిజినెస్ ఆఫర్లు మామూలుగా ఉండవు. సుకుమార్-బన్నీ ఇదంతా గమనిస్తూ ఉండకపోరు. కాబట్టి స్క్రిప్టు విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాలి. మేకింగ్ అదిరిపోవాలి. ‘పుష్ప-1’ మాదిరి ప్రమోషన్ల విషయంలో వెనుకంజ వేయకూడదు. ప్లానింగ్ కరెక్ట్‌గా ఉండాలి. అన్నీ సరిగ్గా కుదిరితే ‘కేజీఎఫ్-2’ దీటుగా ‘పుష్ప-2’ కూడా వసూళ్ల మోత మోగించడం ఖాయం.
This post was last modified on April 16, 2022 8:04 am
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…