కేజీఎఫ్-2.. బాహుబలి-2 తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా హైప్ తెచ్చుకున్న సినిమా. ‘బాహుబలి-2’కు దీటుగా వసూళ్లు రాబడుతూ ఆల్ టైం రికార్డులు కూడా బద్దలుకొడుతోందా చిత్రం. ఇంత భారీ చిత్రానికి ఎడిటర్‌గా పని చేసిన వ్యక్తి కాకలు తీరిన అనుభవశాలే అయ్యుంటాడని అనుకుంటాం.
ఇలాంటి భారీ చిత్రాలకు మామూలుగా ఎంతో అనుభవం ఉన్న, పేరున్న ఎడిటర్లనే పెట్టుకుంటారు. ఐతే ‘కేజీఎఫ్-2’కు పని చేసిన ఎడిటర్ వయసు కేవలం 19 ఏళ్లు అంటే నమ్మగలరా? ఈ చిత్రానికి పని మొదలుపెట్టే సమయానికి అతడి వయసు ఇంకా రెండేళ్లు తక్కువే అంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా?
అవును.. ‘కేజీఎఫ్-2’ ఎడిటర్ ఇంకా టీనేజరే. అతడి పేరు ఉజ్వల్ కులకర్ణి. ఇంత చిన్న వయసులో ఇంత భారీ చిత్రానికి ఎడిటర్‌గా పని చేయడం అంటే మాటలా? కానీ టాలెంటుకి వయసుతో సంబంధం లేదని రుజువు చేస్తూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు ఉజ్వల్.
చిన్న వయసులోనే ఫిలిం ఎడిటింగ్‌లో మెలకువలు నేర్చుకుని.. షార్ట్ ఫిలిమ్స్‌కు సాంకేతిక సహకారం అందిస్తూ.. ఫ్యాన్ ఎడిట్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు ఉజ్వల్. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్-1’కు సంబంధించి ఒక అదిరిపోయే ఎడిట్ చేశాడు.
అది అనుకోకుండా ప్రశాంత్ కళ్లలో పడింది. ఆయనకు అది బాగా నచ్చేసి.. ‘కేజీఎఫ్-2’కు టీజర్ కట్ చేసే బాధ్యత అప్పగించాడు. గత ఏడాది దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన ‘కేజీఎఫ్-2’కు టీజర్ కట్ చేసింది అతనే. దానికి అదిరిపోయే స్పందన రావడంతో మొత్తంగా సినిమాను ఎడిట్ చేసే బాధ్యతను అతడికి అప్పగించాడు ప్రశాంత్.
ఒక్క నిమిషంలో పదుల సంఖ్యలో షాట్లు కనిపించే‘కేజీఎఫ్-2’ లాంటి సినిమాలకు ఎడిటింగ్ చేయడం అంటే మాటలు కాదు. ఎంతో అనుభవం ఉన్నా కూడా సవాలుతో కూడుకున్న విషయం ఇది. అలాంటిది ఇంకా మీసాలు కూడా రాని, పిల్లాడిలా కనిపిస్తున్న ఉజ్వల్ ఇంత భారీ చిత్రానికి పని చేశాడంటే ఎంత స్ఫూర్తిదాయక విషయమో కదా.
This post was last modified on April 15, 2022 5:49 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…