రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే.. తెలుగులో అప్పుడూ పరమ రొటీన్ సినిమాలు వచ్చేవి. కథలు చాలా మామూలుగా ఉండేవి. హీరోయిజం, మాస్, యాక్షన్ అంశాల మీదే ఎక్కువగా దర్శకులు దృష్టిపెట్టేవాళ్లు. హీరోలు ఇమేజ్‌ను దాటి బయటికి వచ్చేవారు కాదు. ఎంతసేపూ ఫ్యాన్స్, మాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఓవర్ ద టాప్ హీరో ఎలివేషన్లు, యాక్షన్ సీన్లతో సినిమాలు చేసేవారు.
ఒక దశలో ఇలాంటి సినిమాల మోతాదు మరీ ఎక్కువైపు ప్రేక్షకులకు కూడా మొహం మొత్తేసింది. అదే టైంలో తమిళ దర్శకులు సరికొత్త, వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసేవారు. ప్రయోగాలు చేసేవారు. అక్కడి హీరోలు కూడా ఇమేజ్ గురించి ఆలోచించకుండా వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేసేవారు. స్టార్ హీరోలు చేసే కమర్షియల్ సినిమాల్లో సైతం ఎంతో కొంత వైవిధ్యం ఉండేది. కానీ గత దశాబ్ద కాలంలో ఈ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. మన దగ్గర వైవిధ్యమైన సినిమాలొస్తున్నాయి. మన హీరోలు ఇమేజ్ ఛట్రం నుంచి బయటికొచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. కానీ తమిళ ఇండస్ట్రీ మాత్రం తిరోగమనంలో పయనిస్తోంది.
ఒకప్పుడు మన దగ్గర మాదిరే ఇప్పుడు తమిళంలో ఊర మాస్, రొటీన్ సినిమాల రాజ్యం నడుస్తోంది. వాళ్లకు వాళ్లు తమ సినిమాలు సూపర్ అనేసుకోవడం.. వాటినే నెత్తిన పెట్టుకోవడం జరుగుతోంది. అన్నాత్తె లాంటి పేలవమైన సినిమా అక్కడ హిట్టవడం.. వలిమై లాంటి యావరేజ్ మూవీ బ్లాక్‌బస్టర్ కావడం ఇందుకు నిదర్శనం.
ఇప్పుడు ‘బీస్ట్’ అనే సినిమా వచ్చింది. దాన్ని కూడా అక్కడి క్రిటిక్స్ సూపరంటున్నారు. ప్రేక్షకులు కూడా ఊగిపోతున్నారు. కానీ ఈ రోజు ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు మాత్రం సోషల్ మీడియాలో ‘బీస్ట్’ను ఆటాడుకుంటున్నారు. ఇందులో సీన్ల గురించి కామెడీలు చేస్తున్నారు. ట్రోలింగ్ మామూలుగా లేదు. ముఖ్యంగా సినిమా చివర్లో హీరో ఫైటర్ జెట్ వేసుకుని పాకిస్థాన్‌కు వెళ్లిపోవడం.. అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్ మీద బాంబుల మోత మోగించడం.. ఉగ్రవాద నాయకుడిని తీసుకుని ఇండియాకు వచ్చేయడం లాంటి సీన్లు మరీ సిల్లీగా అనిపిస్తున్నాయి.
ఒకప్పుడు ‘విజయేంద్ర వర్మ’లో బాలయ్య ప్యారాచ్యూట్ వేసుకుని పాకిస్థాన్ వెళ్లిపోవడం.. ఉగ్రవాద నాయకుడిని మట్టుబెట్టడం లాంటి సీన్లు చూసి తమిళ జనాలు కామెడీలు చేసేవారు. కానీ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు తమిళంలో ఇలాంటి సీన్ పెట్టడంతో మన వాళ్లు అరవోళ్ల మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు.
This post was last modified on April 14, 2022 10:18 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…