Movie News

కేజీఎఫ్-3.. కండిషన్స్ అప్లై

‘బాహుబలి: ది బిగినింగ్’కు కొనసాగింపుగా ‘ది కంక్లూజన్’ వచ్చాక ప్రేక్షకులు ‘బాహుబలి-3’ పట్ల ఆసక్తి ప్రదర్శించారు. ఈ కథను పొడిగిస్తే బాగుంటుందని, ఆ అద్భుత ప్రపంచాన్ని మరోసారి వెండితెరపైకి తెస్తే భలే ఉంటుందని అనుకున్నారు. కానీ రాజమౌళి అలాంటి ప్రయత్నమేదీ చేయలేదు. ఈ కథను కొనసాగించే ఉద్దేశమే లేదని అంటూ బాహుబలి ప్రపంచాన్ని కొనసాగించే అవకాశం ఉందని నర్మగర్భమైన కామెంట్ ఒకటి చేశాడు.

అంటే ఈ కథను అంతటితో వదిలేసి ఆ తరహా భారీ చిత్రం ఇంకోటి చేస్తాడేమో అనుకున్నారు. కానీ సమీప భవిష్యత్తులో అలాంటి సినిమా ఏదీ తెరకెక్కేలా కనిపించడం లేదు. ఇకపోతే ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో భారతీయ ప్రేక్షకులను వెర్రెత్తించిన ‘కేజీఎఫ్’ నుంచి కొత్త సీక్వెల్ వస్తుందనే సంకేతాలు రావడంతో ఆసక్తికర చర్చ మొదలైంది. శుక్రవారం రిలీజైన ‘కేజీఎఫ్: చాప్టర్-2’ రోలింగ్ టైటిల్స్ అంతా అయ్యాక చూపించిన సీన్ చూసి అంతా షాక్ అయ్యారు.

‘కేజీఎఫ్-3’ ఉంటుందనే సంకేతాలు ఇప్పటిదాకా ఆ చిత్ర బృందం నుంచి ఎవ్వరూ ఇవ్వలేదు. ప్రశాంత్ కూడా దాని గురించి ఇప్పటిదాకా ఎక్కడా మాట్లాడలేదు. కానీ ‘చాప్టర్-2’ రోలింగ్ టైటిల్స్ అయిపోవస్తున్న దశలో రవీనా టాండన్ ‘కేజీఎఫ్ చాప్టర్-3’ అనే కొత్త పుస్తకం ముఖచిత్రాన్ని చూస్తున్న దృశ్యం పెట్టడంతో ఈ సిరీస్‌లో ఇంకో సినిమా వచ్చే అవకాశాలున్నాయని అర్థమైంది. ఐతే ఇందులో ఇలా చూపించారని కచ్చితంగా మూడో పార్ట్ వస్తుందని అనుకోలేం.

ఎందుకంటే సెకండ్ పార్ట్‌కు ఎలాంటి స్పందన వస్తుందన్నది కీలకం. ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాకే వస్తోంది ప్రస్తుతానికి. ఎలివేషన్లు, భారీతనం పక్కన పెడితే చాలా విషయాల్లో ‘కేజీఎఫ్-2’ ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే బలహీనమే. సెకండ్ పార్ట్ చూస్తుంటేనే ఓవర్ డోస్ ఫీలింగ్ కూడా కలిగింది. ఇందులో పెద్దగా కథే లేదు. బలవంతంగా సాగదీసినట్లు అనిపించింది.

ఇక ఈ కథను ఇంతకుమించి విస్తరించడానికి ఏం స్కోప్ ఉంది? సెకండ్ పార్టే ప్రేక్షకులను నిరాశకు గురి చేసినపుడు ఇంకో భాగం గురించి ఆలోచించడం కరెక్ట్ అనిపించుకోదు. బహుశా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసి రిజల్ట్ విషయంలో ఒక అంచనాకు వచ్చాక ఇంకో భాగం తీయాలా వద్దా అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారేమో.

This post was last modified on April 14, 2022 3:07 pm

Share
Show comments
Published by
Satya
Tags: KGF 3

Recent Posts

అల్లరోడికి పరీక్ష : 1 అవకాశం 3 అడ్డంకులు!

పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…

30 minutes ago

ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…

46 minutes ago

వైసీపీని ఎవ‌రు న‌మ్ముతారు.. రెంటికీ చెడుతోందా..!

వైసీపీ తీరు మార‌లేదు. ఒక‌వైపు.. ఇండియా కూట‌మిలో చేరేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు…

4 hours ago

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

12 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

13 hours ago