Movie News

హిందీ ‘జెర్సీ’కి కొత్త కష్టం

తెలుగులో మూడేళ్ల కిందట వచ్చిన నాని సినిమా ‘జెర్సీ’ ఒక క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది. కమర్షియల్‌గా ఇంకా పెద్ద సక్సెస్ కావాల్సిన ఆ సినిమా ఓ మోస్తరు విజయంతో సరిపెట్టుకుంది. ఐతే థియేటర్లలో నుంచి వెళ్లిపోయాక ఆ సినిమా గొప్పదనమేంటో అందరికీ అర్థమైంది. ఓటీటీలో చూసి దీన్నో కల్ట్ మూవీగా కొనియాడారు అందరూ. బాలీవుడ్ వాళ్లకు ఈ చిత్రం తెగ నచ్చేసి షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో రీమేక్ చేశారు. ఈ సినిమా హిందీలో మొదలైనపుడే స్యూర్ షాట్ హిట్ అన్న అభిప్రాయాలు కలిగాయి.

తెలుగు వెర్షన్ ప్రొడ్యూసర్ నాగవంశీ, టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు.. బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్ కలిసి ఈ చిత్రాన్ని ఒరిజినల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఐతే కరోనా సహా పలు కారణాలతో ఈ సినిమా బాగా ఆలస్యం అయింది. గత ఏడాది డిసెంబరు 31న విడుదలకు అన్ని ఏర్పాట్లూ చేశాక కొవిడ్ థర్డ్ వేవ్ ధాటికి సినిమాను హఠాత్తుగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఏప్రిల్ 14వ తేదీకి సినిమాను షెడ్యూల్ చేసి ‘కేజీఎఫ్-2’ దూకుడుతో భయపడి 22వ తేదీకి సినిమాను పోస్ట్ పోన్ చేశారు.

ఐతే ఇప్పుడు మళ్లీ ‘జెర్సీ’కి కొత్త తలనొప్పి మొదలైంది. ఈ సినిమా విడుదల ఆపాలంటూ ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు కావడం నిర్మాతలను టెన్షన్ పెడుతోంది. ఆల్రెడీ తెలుగులో రిలీజైన మూడేళ్లు దాటాక, దాని హిందీ వెర్షన్ రిలీజ్‌కు ముందు ఈ కథను కాపీ కొట్టారంటూ ఓ రచయిత కోర్టు మెట్లు ఎక్కడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ రచయిత పేరు రూపేశ్ జైశ్వాల్. 2007లో తాను ‘ది వాల్’ పేరుతో ఓ కథ రాసి.. స్క్రిప్టును రిజిస్టర్ కూడా చేయించానని.. తాను రాసిన కథలో కథంతా ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరుగుతుందని, పూర్తిగా క్రికెట్ నేపథ్యంలోనే నడిచే ఆ కథలో కుటుంబం, ప్రేమ, ఆశయం లాంటి అంశాలు ప్రధానంగా ఉంటాయని.. ఆ కథను కాపీ కొట్టే ‘జెర్సీ’ సినిమా తీశారని సదరు రచయితగా కోర్టులో పిటిషన్ వేయడం గమనార్హం.

ఐతే ‘జెర్సీ’ కథ రాసింది.. సినిమా తీసింది ఒక తెలుగు దర్శకుడు. అతను ముందు తెలుగులో ఈ సినిమా తీశాడు. అప్పుడు ఎవరి నుంచి ఏ అభ్యంతరాలు రాలేదు. ఇప్పుడు అదే సినిమా హిందీలో రీమేక్ అయితే.. ఓ హిందీ రచయిత ఈ కథ తనదంటూ కోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా అనిపిస్తోంది. మరి ఈ అడ్డంకిని ‘జెర్సీ’ టీం ఎలా అధిగమిస్తుందో చూడాలి.

This post was last modified on April 13, 2022 3:02 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

4 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

5 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

5 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

7 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

9 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

9 hours ago