‘ఆర్ఆర్ఆర్’ సినిమా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఒక్కటి చేస్తుందని అనుకుంటే.. దానికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. వారి మధ్య ఇప్పటికే ఉన్న అంతరాన్ని ఇంకా పెంచినట్లే ఉంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి సినిమాలో ఎవరెక్కువ హైలైట్ అవుతారనే విషయంలో వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఏ ప్రోమో రిలీజైనా ఇవే పోలికలతో సోషల్ మీడియాలో కొట్టేసుకోవడం మూడేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక సినిమా రిలీజయ్యాక ఈ ఫ్యాన్ వార్స్ పీక్స్‌కు వెళ్లిపోయాయి.
పెర్ఫామెన్స్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ఇచ్చినప్పటికీ.. పాత్ర లక్షణాల పరంగా చూస్తే అది కొంచెం తగ్గినట్లు అనిపించేసరికి.. అతడి ఫ్యాన్స్ ఫీలవడం.. రాజమౌళిని తిట్టడం.. చరణ్‌ను ట్రోల్ చేయడానికి ప్రయత్నించడం.. మరోవైపు కొంతమంది చరణ్ ఫ్యాన్స్ కూడా అతి చేయడం.. ఇదీ కొన్ని వారాలుగా నడుస్తున్న వ్యవహారం. ఈ గొడవ ఎంతకీ తెగట్లేదు.
తాజాగా ‘నాటు నాటు’ పాట ఫుల్ వీడియో రిలీజ్ చేస్తే.. దాన్ని ఎంజాయ్ చేయడం మాని, నిన్న సాయంత్రం నుంచి అదే పనిగా ట్విట్టర్లో పడి కొట్టేసుకుంటున్నారు తారక్, చరణ్ ఫ్యాన్స్. ఎవరికి వాళ్లు తమ హీరో వీడియోలను కట్ చేసి ఎలివేషన్ వేసుకోవడం..అదే సమయంలో అవతలి హీరో కాలు సరిగా కదపలేదని, తల అనవసరంగా తిప్పాడని, ఎక్స్‌ప్రెషన్ సరిగా ఇవ్వలేదని.. ఇలాంటి కామెంట్లతో కించపరచాలని చూడటం.. ఇదీ వరస.
మన ఇండస్ట్రీ నుంచి ఇద్దరు సూపర్ స్టార్లు ఇగో పక్కన పెట్టి, ఎంతో కష్టపడి సినిమా చేసి అద్భుతమైన పెర్ఫామెన్స్‌లతో ఎవరి స్థాయిలో వాళ్లు హైలైట్ అయ్యారని.. సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిందని, తెలుగు సినిమా ప్రతిష్ఠను పెంచిందని, ప్రపంచ స్థాయిలో మరోసారి మన సినిమా పేరు మార్మోగోతోందని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఉమ్మడిగా కాలర్ ఎగరేయాల్సింది పోయి.. ఇలా సోషల్ మీడియాలో పడి అదే పనిగా కొట్టేసుకోవడం ఏంటో అర్థం కావట్లేదు. ఈ అభిమానుల అతి వల్ల ఇద్దరు హీరోలూ ఇబ్బందిపడుతున్నారు. మొన్న ముంబయిలో ఓ విలేకరి చరణ్‌ను ఇబ్బందికర ప్రశ్న వేసి.. మొత్తం ‘ఆర్ఆర్ఆర్’ టీంను ఇబ్బంది పెట్టిందంటే.. ఈ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో చేసిన అతి పుణ్యమే. ఇంకోసారి ఇలా మల్టీస్టారర్లు చేయడానికి భయపడేలా ఫ్యాన్స్ మరీ దిగజారి ప్రవర్తిస్తుండటం ఎంతమాత్రం మంచి సంకేతం కాదు.
This post was last modified on April 12, 2022 3:30 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…