మీరా చోప్రా గుర్తుందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బంగారంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ఉత్తరాది భామ.. ఆ తర్వాత వాన, మారో, గ్రీకు వీరుడు లాంటి మరికొన్ని చిత్రాల్లోనూ నటించింది. ఐతే తెలుగులో ఆమె నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో చాలా త్వరగా కనుమరుగైపోయింది. వేరే భాషల్లో కూడా మీరాకు విజయాలు దక్కలేదు. ఆమెను తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయిన టైంలో ఎన్టీఆర్ అభిమానుల పుణ్యమా అని ఆ మధ్య సోషల్ మీడియాలో తన పేరు హాట్ టాపిక్ అయింది.
సోషల్ మీడియాలో ఇలాంటి కెరీర్ ముగిసిన హీరోయిన్లు చిట్ చాట్‌లు పెట్టడం మామూలే. అలాంటి వాళ్లను ఫ్యాన్స్ తమ హీరోల గురించి ఓ మాట చెప్పమని అడగడమూ సహజమే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే మీరాను అడిగితే.. ఎవరు ఎన్టీఆర్ అంటూ ఆమె వెటకారమాడింది. దీంతో తారక్ ఫ్యాన్స్‌కు ఒళ్లు మండి ఆమెను బూతులు తిట్టారు. తర్వాత ఆమె వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది వ్యవహారం.
ఇందులో సోషల్ మీడియాలో ఉండే ఊరూ పేరు లేని అభిమానుల తప్పుందే తప్ప.. ఎన్టీఆర్‌ను నిందించడానికి ఏమైనా ఉందా? ఐతే ఇప్పుడేమాత్రం పని లేని మీరా మాత్రం.. పనిగట్టుకుని తారక్‌ను డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేసింది. తాజాగా ఆమె పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న సౌత్ సినిమాలు, స్టార్ల గురించి ఒక అప్రిసియేషన్ ట్వీట్ వేసింది.
అందులో భాగంగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, యశ్‌ల పేర్లు ప్రస్తావించి వారిని కొనియాడింది. ఐతే ఆర్ఆర్ఆర్‌లో భాగమైన చరణ్‌ను మాత్రం పొగిడి.. తారక్ పేరును విస్మరించడం అతి కాక మరేంటి? ఇది కావాలనే తారక్ ఫ్యాన్స్‌ను గిల్లడం తప్ప మరేమీ కాదు. ఇంతకుముందు తారక్ ఫ్యాన్స్ చేసింది తప్పే అయినా.. మీరా అటెన్షన్ కోసమే వారిని కవ్వించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈసారి ఆమె చేసింది మరీ అతిగా ఉంది. కచ్చితంగా ఇది అటెన్షన్ కోసమే వేసిన ఎత్తుగడ అనడంలో సందేహం లేదంటున్నారు నెటిజన్లు.
This post was last modified on April 10, 2022 2:25 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…