Movie News

చరణ్‌కు కొరటాల ఎలివేషన్

‘రంగస్థలం’ ముందు వరకు నటుడిగా అయితే రామ్ చరణ్‌కు మరీ గొప్ప పేరేమీ లేదు. ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్‌తో పాటు కొన్ని ఘనవిజయాలు అందుకున్నప్పటికీ.. సామాన్య ప్రేక్షకుల్లో రామ్ చరణ్ నటన పట్ల అంత సానుకూల అభిప్రాయం ఉండేది కాదు. కానీ ‘రంగస్థలం’ సినిామతో తన మీద ఉన్న నెగెటివిటీనంతా చెరిపేశాడు మెగాస్టార్ వారసుడు. ఇప్పుడిక ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు.

చరణ్ పెర్ఫామెన్స్ గురించి స్వయంగా రాజమౌళే ఎంత గొప్పగా చెబుతున్నాడో చూస్తూనే ఉన్నాం. తానెంత మంచి నటుడినో చరణ్‌కి తెలియదని, ప్రతి రోజూ సెట్‌కు ఒక వైట్ కాన్వాస్ లాగా వస్తాడని.. దాని మీద ఏం కావాలో అది రాసుకోవచ్చని.. ఇలాంటి నటుడిని తాను ఇప్పటిదాకా చూడనే లేదని రాజమౌళి ఇటీవల చెప్పడం తెలిసిందే. ఇప్పుడు చరణ్‌తో ‘ఆచార్య’ సినిమా చేసిన కొరటాల శివ సైతం దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో.

ఇంతకీ ‘ఆచార్య’లో సిద్ధా పాత్ర గురించి, అందులో చరణ్ పెర్ఫామెన్స్ గురించి కొరటాల ఏమన్నాడంటే..‘‘నేను చెప్పేదాంట్లో కొంచెం కూడా అతిశయోక్తి లేదు. ఒకసారి క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత.. ప్రతి రోజూ మేం ఆయనలో మేం సిద్ధాను మాత్రమే చూశాం. మొత్తం కాస్ట్ అండ్ క్రూ అందరూ ఆయనలో సిద్ధాను మాత్రమే చూశాం. మెగా పవర్ స్టార్ కానీ..రామ్ చరణ్ కానీ చూడలేదు. వ్యాన్ దిగడం సిద్ధా లాగే వస్తాడు. ఆ పాత్రను నమ్మాడు. అంత నిజాయితీగా ఉన్నారు.

ఇది ఒక రకంగా చెప్పాలంటే నాకు కల నిజమైనట్లే. అలాంటి నటులు మనకు  దొరికినపుడు మనం అనుకున్నది ఇంకా తేలిక అవుతుంది. ఇంపాక్ట్ డబుల్ అవుతుంది. నిజంగా రామ్ చరణ్ గారికి సిన్సియర్‌గా థ్యాంక్స్ చెబుతున్నా. రామ్ చరణ్ మామూలుగా కూడా చాలా నిజాయితీగా అనిపిస్తాడు. షూటింగ్‌కు రావడమంటే తనకు స్కూల్‌కు వెళ్లినట్లే ఉంటుంది.

అతను కొత్త నటుడు కాదు. సూపర్ స్టార్ డమ్ వచ్చిన తర్వాత ప్రతి రోజూ జీరో బ్యాగేజ్‌తో సెట్లోకి రావడం కానీ.. పాత్రలో మాత్రమే ఉండటం.. నిజాయితీగా, ఒక చిన్న పిల్లాడిలాగా కనిపిస్తాడు. తర్వాతేంటి అంటే.. ఏమీ రాయని పలక లాగా కనిపిస్తాడు. మనం చెప్పింది ఎక్కించుకుని వెళ్లి అక్కడ చేసేస్తాడు. ఇలాంటి నటులు అరుదుగా ఉంటారు. చరణ్ లాంటి నటుడు నా సినిమాలో చేయడం నా అదృష్టం’’ అంటూ చరణ్‌పై కొరటాల ప్రశంసల జల్లు కురిపించాడు.

This post was last modified on April 9, 2022 5:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

18 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

57 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago