దాదాపు ఏడాదిన్నర కిందట ఇంకా షూటింగ్ మొదలు కాకముందే టైటిల్, ప్రి లుక్ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచింది సలార్ టీం. ఐతే ఆ తర్వాత ఇప్పటిదాకా ఏ ముచ్చటా లేదు. సినిమా షూటింగ్ గురించి కూడా ఏ అప్డేట్ లేదు. చిత్రీకరణ ఎంత పూర్తయింది, టాకీ పార్ట్ ఎప్పుడవుతుంది.. సినిమా ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాలపై ఏ స్పష్టతా లేదు.
ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫోకస్ మొత్తం కేజీఎఫ్-చాప్టర్ 2 మీదే ఉంది. వచ్చే శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కాగా అదే రోజు సలార్ టీజర్ లాంచ్ అవుతుందంటూ ఇప్పుడు గట్టి ప్రచారం జరుగుతుండటం విశేషం. దీని గురించి బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు బయటికి రావడం విశేషం. కేజీఎఫ్-2 సినిమా ఇంటర్వెల్లో సలార్ టీజర్‌ను ప్రదర్శిస్తారని.. ఈ సినిమా ప్రింట్లతో పాటు సలార్ టీజర్‌ను ఎటాచ్ చేస్తున్నారని.. ఈమేరకు డిస్ట్రిబ్యూటర్లకు కూడా సమాచారం ఇస్తున్నారని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా సలార్ ట్రెండ్ అయిపోతోంది. ప్రభాస్ అభిమానులు ఎగ్జైట్ అయిపోతున్నారు. కానీ ఇప్పటిదాకా సలార్ నుంచి ప్రభాస్ ఫుల్ లెంగ్త్ ఫస్ట్ లుక్కే రిలీజ్ కాలేదు. కేజీఎఫ్-2 ప్రమోషన్ల మీద దృష్టిపెట్టిన ప్రశాంత్ ఇప్పుడు సలార్ టీజర్ పని పెట్టుకుంటాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అయినా ఇంత పెద్ద సినిమా టీజర్ లాంచ్ చేయబోతున్నారంటే ముందు కొంచెం ప్రమోషనల్ హంగామా ఉండాలి. ఇప్పటిదాకా అయితే అలాంటిదేమీ కనిపించడం లేదు. మరి బాలీవుడ్ మీడియా చెబుతున్నట్లు నిజంగానే కేజీఎఫ్-2 సినిమా మధ్యలో సలార్ టీజర్ ప్రదర్శితమవుతుందా అన్నది చూడాలి.
This post was last modified on April 8, 2022 8:50 am
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…