Movie News

తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ సంచలనం

తెలుగు సినిమాలు కన్నడనాట సంచలనం రేపడమే తప్ప.. కన్నడ సినిమాలు తెలుగులో వసూళ్ల మోత మోగించడం అరుదు. అప్పుడెప్పుడో ఉపేంద్ర నటించిన ఎ, ఉపేంద్ర లాంటి సినిమాలు ఇక్కడ బాగా ఆడాయి కానీ.. ఆ తర్వాత కన్నడ డబ్బింగ్ చిత్రాలేవీ కనీస ప్రభావం కూడా చూపింది లేదు. ఇలాంటి టైంలో మూడేళ్ల కిందట ‘కేజీఎఫ్’ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ట్రైలర్ చూస్తే మన ‘ఛత్రపతి’ లాంటి సినిమాలా కనిపించేసరికి మన వాళ్లు ముందు లైట్ తీసుకున్నారు కానీ.. టాక్ అదిరిపోవడంతో ఎగబడి ఈ సినిమా చూశారు.

మాస్, యాక్షన్ ప్రియులను ‘కేజీఎఫ్’ మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు. థియేటర్లలో ఘన విజయాన్నందుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత ఓటీటీలో మరింతగా మన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అప్పట్నుంచి ‘కేజీఎఫ్-చాప్టర్ 2’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించబోతోంది. వచ్చే శుక్రవారమే ‘కేజీఎఫ్-2’ థియేటర్లలోకి దిగబోతోంది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ చూస్తే షాకవ్వక తప్పదు.

ఏపీ, తెలంగాణలో కలిపి వంద కోట్లకు పైగా బిజినెస్ చేసిన తొలి పర భాషా చిత్రంగా ‘కేజీఎఫ్’ నిలిచింది. ఇప్పటిదాకా ‘2.0’ రూ.70 కోట్లతో రికార్డును కలిగి ఉంది. దాన్ని భారీ మార్జిన్‌తో ‘కేజీఎఫ్-2’ కొట్టేసింది. ఒక్క నైజాం ఏరియాకే ‘కేజీఎఫ్-2’ హక్కులు రూ.50 కోట్లు పలకడం విశేషం. రాజమౌళి సినిమాలు బాహుబలి-2, ఆర్ఆర్ఆర్‌కు మినహాయిస్తే తెలుగులో మరే చిత్రానికీ తెలుగులో నైజాం హక్కులు ఇంత రేటు పలకకపోవడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఈ చిత్రం రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. సీడెడ్ హక్కులు రూ.20 కోట్లకు, ఏపీలో మిగతా ఏరియాలన్నింటికీ కలిపి రైట్స్ 42 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. మొత్తంగా ‘కేజీఎఫ్-2’ తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్లకు పైగా బిజినెస్ చేయడం విశేషం. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతుందని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. దీన్ని బట్టి సినిమా మీద ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్‌లో ఏ స్థాయిలో హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on April 7, 2022 8:15 pm

Share

Recent Posts

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

38 minutes ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

45 minutes ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

51 minutes ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

2 hours ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

3 hours ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

3 hours ago