పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న స్టామినాకు బాహుబలి తరహా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేస్తే దాని రేంజే వేరుగా ఉంటుందని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు ఫ్యాన్స్. వారి కోరికను క్రిష్ తీర్చేయబోతున్నాడు. హరిహర వీరమల్లు నుంచి ఇప్పటిదాకా రిలీజైన ప్రోమోలు చూస్తే ఇది బాహుబలి లైన్లోనే తెరకెక్కుతున్న భారీ చిత్రంలా కనిపిస్తోంది. ఐతే ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. కరోనా, ఇతర కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది.
సగం చిత్రీకరణ జరిపాక ఈ సినిమాకు బ్రేక్ పడింది. పవన్ భీమ్లా నాయక్‌లో బిజీ అయిపోయాడు. క్రిష్ ఏమో కొండపొలం పనిలో పడ్డాడు. వీళ్లిద్దరూ ఆ చిత్రాలను పూర్తి చేశాక కూడా హరిహర వీరమల్లు పునఃప్రారంభం కావడంలో ఆలస్యం జరుగుతోంది. ఐతే తర్వాతి షెడ్యూల్లో చిత్రీకరించాల్సినవి భారీ యుద్ధ సన్నివేశాలు కావడంతో దీనికోసం ప్రిపరేషన్ అవసరమైంది.
మామూలుగా ఇలా వచ్చి అలా షూటింగ్ చేసి వెళ్లిపోయే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సి వచ్చింది. మరి కొన్ని రోజుల్లో కొత్త షెడ్యూల్ ఆరంభం కానుండగా పవన్ ఇందుకోసం ప్రిపరేషన్లో ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చింది. టీషర్ట్, షార్ట్స్ వేసుకుని.. మోకాళ్లకు దెబ్బలు తగలకుండా తొడుగులు వేసుకుని ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తాతో కలిసి ఈ ఫొటోకు పోజు ఇచ్చాడు పవన్.
పవర్ స్టార్‌ను సరికొత్త లుక్‌లో చూసి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్ ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. పవన్ కూడా సినిమా కోసం ఇలా ప్రిపేరవుతాడా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ ఓ కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని బహు భాషల్లో నిర్మిస్తున్నాడు.
This post was last modified on April 7, 2022 10:05 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…