రామ్ గోపాల్ వర్మ సినిమాలను జనాలు లైట్ తీసుకోవడం మొదలై చాలా కాలమైంది. ఈ మధ్య ఆయన సినిమాలు రిలీజవుతున్న సంగతి కూడా జనాలకు తెలియడం లేదు. రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి తేలేని పరిస్థితి ఉంటోంది. ఒకప్పటి వర్మ డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన పేరెత్తితే తల పట్టుకునే స్థితిలో ఉన్నారు. కంటెంట్‌ను కాకుండా కాంట్రవర్శీలను నమ్ముకుని కొన్నాళ్లు బండి లాగించిన వర్మకు.. ఇప్పుడు ఆ గిమ్మిక్కులు కూడా ఫలితాన్నివ్వడం లేదు.
ఆయన సినిమాలా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. వర్మ చిత్రం అంటే కనీస స్థాయిలో కూడా బజ్ కనిపించని పరిస్థితుల్లో థియేటర్లు దొరకడం కూడా గగనం అయిపోతోంది. అందులోనూ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా ఇరగాడేస్తుండగా.. కొత్తగా గని అనే పేరున్న సినిమా రిలీజవుతుండగా.. ఖత్రా డేంజరస్ అనే ఏమాత్రం బజ్ లేని సినిమాను ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు ఎక్కడ ముందుకు వస్తారు?
సింగిల్ స్క్రీన్లు అస్సలు ఇచ్చే పరిస్థితి కనిపించకపోగా.. మల్టీప్లెక్సులు సైతం వెనుకంజే వేస్తున్నాయి. ఈ నెల 8న రిలీజ్ అంటే.. హైదరాబాద్‌లో ఈ సినిమాకు ఒక్క షోకు కూడా కేటాయించలేదు. థియేటర్లు కేటాయించడం డిమాండ్ మేరకే ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరోయిన్లతో వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్ చేయించి, ఇంటిమేట్ సీన్లు పెట్టినా సోషల్ మీడియాలో కూడా ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడుకోవట్లేదు.
ప్రేక్షకుల్లో అసలేమాత్రం ఈ సినిమా పట్ల ఆసక్తి లేదు. ఈ నేపథ్యంలోనే థియేటర్లు దొరకడం కష్టమైనట్లుంది. ఐతే పీవీఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్సులు ఇది లెస్బియన్ ఫిలిం కావడంతో ప్రదర్శనకు అనుమతి ఇవ్వట్లేదని, ఇది ఎల్జీబీటీ కమ్యూనిటీ హక్కులను కాలరాయడమే అంటూ వర్మ ట్విట్టర్లో కాంట్రవర్శీ క్రియేట్ చేయడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. కానీ వర్మను లైట్ తీసుకున్న జనాలకు ఇదేమీ పట్టట్లేదు. పరిస్థితి చూస్తుంటే ఎప్పట్లా వర్మ తనే సొంతంగా పెట్టుకున్న ఓటీటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసుకోక తప్పేలా లేదు.
This post was last modified on April 6, 2022 9:34 pm
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు…
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ దశ తిరిగే విషయం వెలుగు చూసింది. ఆ దేశంలోని పంజాబ్…
అగ్రరాజ్యం అమెరికాలో ధనవంతులు నివసించే ప్రాంతం అది! కడుక్కున్న కాళ్లతో అక్కడ అడుగులు వేసినా ముద్రపడతాయేమో.. మట్టి అంటుతుందేమో.. అని…
ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర ప్రయాగ్‌రాజ్ జిల్లాలో సోమవారం(జనవరి 13) నుంచి 45 రోజుల పాటు జరగను న్న మహా కుంభమేళాకు సర్వం…
సీనియర్ స్టార్ హీరోల్లో వరసగా మూడు బ్లాక్ బస్టర్లున్న హీరో ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కరే. రెండో హ్యాట్రిక్ కు శ్రీకారం…
కార్పొరేట్ కంపెనీలు ఇటీవల కాలంలో పని ఒత్తిడితో పాటు టైమ్ ను కూడా మెల్లగా పెంచుతున్న విధానంపై తీవ్ర స్థాయిలో…