విష్ణు విశాల్.. తమిళంలో మంచి పేరున్న హీరోనే. అతడి తండ్రి రమేష్ కుడవ్లా ఐపీఎస్ అధికారి కావడం విశేషం. ఆయన డీజీపీ హోదాలో కూడా పని చేశారు. ఇలాంటి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన విష్ణు విశాల్.. సినిమాల్లోకి అడుగు పెట్టి తన టాలెంట్ రుజువు చేసుకున్నాడు. ముందాసపట్టై, జీవా, ఇండ్రు నేట్రు నాలై లాంటి మంచి హిట్లతో కథానాయకుడిగా ఒక స్థాయిని అందుకున్నాడు. అతను నిర్మాతగా కూడా మారి విజయాలందుకున్నాడు. ఇప్పటికే ‘అరణ్య’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అతను.. ఇటీవల ‘ఎఫ్ఐఆర్’ సినిమాతో తెలుగులోకి హీరోగా అడుగు పెట్టాడు.
అతడి భార్య జ్వాల గుత్తా తన పరపతినంతా ఉపయోగించి ఈ సినిమాకు తెలుగులో బాగానే ప్రమోషన్ చేయించింది. ఈ చిత్రానికి మంచి రిలీజ్ కూడా దక్కింది. ‘ఎఫ్ఐఆర్’ సినిమాకు తెలుగులో మాస్ రాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరించడం తెలిసిందే.తన సినిమా ‘ఖిలాడి’ రిలీజవుతున్న రోజే ‘ఎఫ్ఐఆర్’ విడుదలైనప్పటికీ.. ఆ చిత్రానికి రవితేజ సమర్పకుడిగా ఉండటం విశేషమే. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో కూడా పాల్గొని విష్ణు మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు మాస్ రాజా. ఐతే వీరి బంధం ఈ ఒక్క సినిమాకు పరిమితం కాలేదు.
ఇప్పుడు ఇద్దరూ కలిసి నటించబోతున్నారు. విష్ణు కొత్త చిత్రంలో రవితేజ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అంతే కాదు ఈ సినిమాను విష్ణుతో కలిసి రవితేజనే నిర్మించబోతున్నాడు. విష్ణుకిది 18వ సినిమా. దీని టైటిల్‌ను కూడా మంగళవారమే ప్రకటించారు. మట్టికుస్తీ అనే ఈ సినిమాకు చెల్లా అయ్యవు దర్శకుడు.
హీరోగా ఒక స్థాయిని అందుకున్నాక రవితేజ సోలో హీరోగానే నటిస్తూ వచ్చాడు. ఐతే ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్లో రానున్న సినిమాలో అతిథి పాత్రకు ఒప్పుకున్నాడు. ఇప్పుడు విష్ణు విశాల్‌తో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే అతను నందమూరి బాలకృష్ణతోనుూ స్క్రీన్ షేర్ చేసుకుంటాడని వార్తలొస్తున్నాయి.
This post was last modified on April 6, 2022 9:38 am
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…