విమలా రామన్ గుర్తుందా? అంత సులువుగా మరిచిపోయే హీరోయినా అంటారా? దివంగత ఉదయ్ కిరణ్ సరసన అబద్ధం అనే సినిమాతో కథానాయికగా పరిచయం అయిన ఈ తమిళ అమ్మాయి.. ఆ తర్వాత ఎవరైనా ఎపుడైనా, కులుమనాలి, గాయం-2, చట్టం, రాజ్, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి లాంటి పలు తెలుగు చిత్రాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో సూపర్ సెక్సీగా కనిపించి కుర్రాళ్ల గుండెలకు గాయం చేసిందీ భామ.
ఐతే ఆమె నటించిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ కావడంతో కెరీర్ అనుకున్నంతగా పుంజుకోలేదు. ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది. చాలా ఏళ్ల కిందటే ఛాన్సులు ఆగిపోయాయి. తమిళంలో కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు. కోలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్‌కు పడిపోయిన విమల.. ఇంకా లైమ్ లైట్లో ఉండటానికి కారణం.. ఆమె ప్రేమాయణమే. తెలుగులో వాన సినిమాలో హీరోగా నటించిన వినయ్ రాయ్.. విమలారామన్ బాయ్ ఫ్రెండ్ కావడం విశేషం.
తమిళంలో నటుడిగా అతడికి మంచి పేరే ఉంది. ఇప్పుడతను అక్కడ మంచి డిమాండ్ ఉన్న విలన్లలో ఒకడు. తుప్పరివాలన్ (తెలుగులో డిటెక్టివ్)లో విలన్ పాత్రతో అతను అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. ఆ తర్వాత డాక్టర్, ఈటి లాంటి చిత్రాల్లో విలన్‌గా అదరగొట్టాడు. కొన్నేళ్ల ముందు వినయ్‌కి విమలతో పరిచయమైంది.
తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ముందు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగానే ఉంచారు కానీ.. ఈ మధ్య ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఇద్దరూ కలిసి విహారయాత్రలకు వెళ్తూ ఆ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. త్వరలోనే ఈ జోడీ పెళ్లి కూడా చేసుకోబోతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఇద్దరూ చెప్పకనే చెబుతున్నారు.
This post was last modified on April 5, 2022 6:43 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…