సాయిమాధవ్ బుర్రా.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ రైటర్లలో ఒకడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనే ఇప్పుడు తెలుగులో నంబర్ వన్ రచయిత అని కూడా చెప్పొచ్చు. తాజాగా ఆయన ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రానికి సంభాషణలు అందించారు. దీని కంటే కృష్ణం వందే జగద్గురుం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి.. ఇలా ఎన్నో సినిమాలు ఆయన మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఐతే ఇందులో సాయిమాధవ్‌కు కెరీర్ ఆరంభంలో గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఒకటి. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో శర్వానంద్-నిత్యా మీనన్ జంటగా నటించిన ఆ చిత్రంలో డైలాగ్స్ చాలా గొప్పగా ఉంటాయి. ఐతే సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ.. కమర్షియల్‌గా అనుకున్నంత విజయం సాధించలేదు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు తనకు రచయితగా మంచి పేరు తెచ్చినప్పటికీ.. తనకా సినిమా నచ్చదని సాయిమాధవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
ఇందుకు కారణం కూడా ఆయన వివరించారు. ఆ సినిమా నిండా డైలాగులే ఉంటాయి తప్ప.. ఇంకేమీ ఉన్నట్లు అనిపించదని సాయిమాధవ్ చెప్పారు. ప్రతి సన్నివేశంలోనూ ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారని.. సినిమా నిండా ఇలా డైలాగులు మాత్రమే ఉంటే ఎలా అని సాయిమాధవ్ అన్నారు. ఆ సినిమాకు తాను ఎంతో ఇష్టపడి, మంచి డైలాగులే రాశానని.. తన మాటలు తనకు నచ్చినా సినిమా మాత్రం నచ్చలేదంటూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పారు సాయిమాధవ్.
ఇక ఆర్ఆర్ఆర్ గురించి చెబుతూ.. ఈ సినిమాతో రాజమౌళి దర్శకుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగాడని.. ప్రతి సన్నివేశంలోనూ కథను, పాత్రల వ్యక్తిత్వాన్ని చెప్పే ప్రయత్నం చేశాడని.. హీరోలిద్దరూ కలిసే సన్నివేశంలో నీరు, నిప్పుడు రెంటినీ కలిపి చూపించిన వైనం.. రామ్ పాత్ర ఆరంభ సన్నివేశంలో తన వ్యక్తిత్వాన్ని చాటేలా ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దిన తీరు అమోఘమని ఆయన జక్కన్నను కొనియాడారు.
This post was last modified on April 5, 2022 2:19 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…