‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ముంగిట ఈ సినిమా విజయంపై చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. బాహుబలి-2 కలెక్షన్లను మించితే తప్ప బ్రేక్ ఈవెన్ కాలేని పరిస్థితుల్లో ఇది నిజంగా బాక్సాఫీస్ సక్సెస్ అవుతుందా లేదా అన్న డౌట్లు కొట్టాయి చాలామందిలో. ‘బాహుబలి’ తరహాలో మ్యాజిక్ చేయడం రాజమౌళికి కూడా సాధ్యం కాదని, టాక్ అటు ఇటు అయితే అంతే సంగతులు అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ నిజానికి ఈ సినిమాకు మరీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. ‘బాహుబలి’లా అందరూ ఈ సినిమాను మెచ్చలేదు. నెగెటివ్ కామెంట్లు బాగానే వినిపించాయి. అయినా సరే.. ఈ సినిమా అన్నింటినీ అధిగమించి బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. మిగతా చోట్ల అంతటా కూడా ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ ఫిగర్స్ చూసి ట్రేడ్ పండిట్లకు కూడా మతులు పోతున్నాయి. రెండో వీకెండ్ పూర్తయ్యేసరికి ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ రూ.900 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉండటం అసాధారణమైన విషయం.
ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ మార్కుకు చేరువగా ఉంది. పది రోజులకు గాను ఈ చిత్రం ఇక్కడ రూ.97 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రాన్ని తెలంగాణలో రిలీజ్ చేసిన దిల్ రాజు రూ.75 కోట్లకు హక్కులు కొన్నారు. ఆయన ఆల్రెడీ రూ.20 కోట్లకు పైగా లాభాన్ని జేబులో వేసుకున్నారు. ఫుల్ రన్లో ఈ చిత్రం నైజాం వరకే రూ.110 కోట్ల షేర్ సాధిస్తుందన్న అంచనాలున్నాయి. పెద్ద సినిమాలకు ఓవరాల్‌గా రూ.100 కోట్ల షేర్ పెద్ద సవాలుగా మారిన పరిస్థితుల్లో ఒక్క తెలంగాణ వరకే ఈ చిత్రం రూ.110 కోట్ల షేర్ సాధిస్తోందంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక సీడెడ్లో ఇప్పటిదాకా ఏ చిత్రం కూడా రూ.35 కోట్ల షేర్ మార్కునే అందుకోలేదు. అలాంటిది ‘ఆర్ఆర్ఆర్’ ఆల్రెడీ రూ.40 కోట్ల షేర్ మార్కును దాటేసింది. ఫుల్ రన్లో రూ.45 కోట్ల బెంచ్ మార్క్ సెట్ చేసేలా కనిపిస్తోంది. ఇక ఆంధ్రాలో ఈ చిత్రం రూ.92 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అక్కడ కూడా రూ.100 కోట్ల షేర్ మార్కును దాటడం గ్యారెంటీ. తెలంగాణలో మాదిరి రేట్లుంటే ఆంధ్రా, రాయలసీమల్లో నంబర్లు ఇంకో రేంజిలో ఉండేవి. ఆల్రెడీ ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో రూ.200 కోట్ల షేర్ మార్కును దాటేసింది. రూ.250 కోట్ల షేర్‌తో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇండియాలో ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ రూ.200 కోట్ట నెట్ వసూళ్ల దిశగా పరుగులు పెడుతుండగా.. యుఎస్‌లో ఈ చిత్రం 12 మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేసింది.
This post was last modified on April 4, 2022 3:14 pm
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…