వారం రోజులుగా ఇండియా అంతటా ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం చూస్తున్నాం. తొలి వీకెండ్లో ఆ సినిమా ఎలా వసూళ్ల మోత మోగించిందో తెలిసిందే. వీకెండ్ తర్వాత వసూళ్లు కాస్త తగ్గాయి కానీ.. ఏ సినిమాకైనా ఆ మాత్రం డ్రాప్ మామూలే. వీకెండ్లో మళ్లీ ఆ సినిమా బలంగా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్లు. కాకపోతే ఈ వారం రిలీజవుతున్న కొత్త సినిమాల ప్రభావం ‘ఆర్ఆర్ఆర్’ మీద ఏ మాత్రం ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. వివిధ భాషల్లో ఈ వారం కొత్త సినిమాలు రిలీజయ్యాయి. తె
లుగులో తాప్సి ప్రధాన పాత్ర పోషించిన ‘మిషన్ ఇంపాజిబుల్’తో పాటు హిందీలో జాన్ అబ్రహాం హీరోగా చేసిన ‘ఎటాక్’.. తమిళంలో ఓ మూడు సినిమాలు.. ఇవి కాక హాలీవుడ్ మూవీ ‘మార్బియస్’ కూడా ఈ వారాంతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘ఎటాక్’, ‘మార్బియస్’ చిత్రాల మీద మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. ఐతే ఈ చిత్రాలలో వేటికీ సరైన టాక్ రాకపోవడం ‘ఆర్ఆర్ఆర్’కు పెద్ద ప్లస్ అయ్యేలా ఉంది.
హిందీ మార్కెట్లో ‘ఎటాక్’ మీద అందరి దృష్టీ నిలిచింది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం సాగుతున్నప్పటికీ ధైర్యంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారంటే ఇందులో విషయం ఉండే ఉంటుందని.. ‘ఆర్ఆర్ఆర్’కు గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నారు. కానీ ఈ చిత్రంలో యాక్షన్ తప్ప ఏమీ లేదంటూ క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. రివ్యూలన్నీ నెగెటివ్‌గానే ఉన్నాయి. ఓపెనింగ్స్ కూడా ఆశాజనకంగా లేవు. సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తుంటే ‘ఎటాక్’ ఫ్లాప్ అవడం గ్యారెంటీ అనిపిస్తోంది.
ఇక ‘మార్బియస్’ విషయానికి వస్తే హాలీవుడ్లో వచ్చిన వరస్ట్ సూపర్ హీరో సినిమాల్లో ఇదొకటని అంటున్నారు. ఈ చిత్రం ఇండియాలో పెద్దగా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా కూడా నెగెటివ్ టాక్‌తో మొదలైంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ దర్శకుడు స్వరూప్ నుంచి ఇలాంటి సినిమా ఆశించలేదన్నది మెజారిటీ జనాలు అంటున్న మాట. ఈ నేపథ్యంలో రెండో వీకెండ్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’కు ఎదురు లేనట్లే కనిపిస్తోంది.