విశ్వక్ సేన్.. ఈ పేరు టాలీవుడ్లో కొన్నేళ్లుగా హాట్ టాపిక్ మారింది. వెళ్ళిపోమాకే అనే చిన్న సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడతను. ఆ సినిమా రిలీజైన సంగతి కూడా చాలామందికి తెలియదు. అందులో చాలా అమాయకమైన కుర్రాడిగా కనిపించాడు విశ్వక్. ఆ తర్వాత అతను నటించిన ఈ నగరానికి ఏమైంది యూత్‌ను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాతో విశ్వక్‌లో కొత్త కోణం చూశారందరూ.
ఆ తర్వాత స్వీయ దర్శకత్వంలో నటించిన ఫలక్ నుమా దాస్ (మలయాళ అంగామలై డైరీస్‌కు రీమేక్)తో విశ్వక్ పేరు మార్మోగింది. ఆ సినిమా ప్రోమోలు ఒక సెన్సేషన్. దానికి తోడు విశ్వక్ బయట ప్రమోషన్లలో మాట్లాడిన మాటలు, అతను చూపించిన యాటిట్యూడ్ కూడా సినిమాకు హైప్‌ను పెంచాయి. ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు లేకపోయినా వసూళ్లు బాగానే వచ్చాయి. ఆ తర్వాత హిట్ మూవీతో ఇంకో హిట్ ఖాతాలో వేసుకున్నాడు విశ్వక్.
ఐతే వేదికల మీద మాట్లాడేటపుడు విశ్వక్ మరీ అతి చేస్తుంటాడని.. పబ్లిసిటీ కోసమే టూమచ్‌గా మాట్లాడుతుంటాడని తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయి. విజయ్ దేవరకొండను అనుకరించే ప్రయత్నంలో హద్దులు దాటిపోతుంటాడని కూడా కామెంట్లు పడుతుంటాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా విశ్వక్ తన స్టయిల్లో తాను వెళ్లిపోతుంటాడు.
సోషల్ మీడియాలో ఈ వ్యతిరేకత కూడా సినిమాల పబ్లిసిటీకి ఉపయోగపడుతుందనుకునే టైపు అతను. ఐతే ఈ నెగెటివిటీ ఎలా ఉన్నా, సక్సెస్ రేట్ మరీ గొప్పగా లేకపోయినా.. విశ్వక్‌కు ఛాన్సులకైతే లోటు లేదు. తాజాగా అతడి పుట్టిన రోజు సందర్భంగా ముఖచిత్రం అనే సినిమా టీజర్ వచ్చింది. దీంతో పాటు అతడి నుంచి రిలీజ్‌కు రెడీగా ఉన్న అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా చిత్రాల నుంచి బర్త్ డే విషెస్‌తో కొత్త పోస్టర్లు రిలీజయ్యాయి.
మరోవైపు గామి అనే సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇవి కాక కొత్తగా దమ్కీ అనే సినిమా మొదలు పెట్టాడు. ఇంకా ఫలక్ నుమా దాస్-2, స్టూడెంట్ అనే కొత్త సినిమాల్లో నటించనున్నట్లు కూడా అతను వెల్లడించాడు. యువ కథానాయకుల్లో ఇంత బిజీగా ఉన్న హీరో ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో.
This post was last modified on March 31, 2022 11:35 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…