అంచనాలకు తగ్గట్లే రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన వారం రోజులు పూర్తి కావొస్తున్న వేళ.. కలెక్షన్ల వేటలో మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఇప్పటికే బోలెడన్ని రికార్డుల్ని బ్రేక్ చేసిన ఈ సినిమా.. పలు దేశాల్లో కొత్త చరిత్రగా మారింది. మన దేశానికి అనుకొని ఉంటే నేపాల్ లో ఈ మూవీ కలెక్షన్లు సునామీని తలపిస్తున్నాయి.
నేపాల్ సినీ చరిత్రలో మరే సినిమాకు లేనంత భారీ వసూళ్లను ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంటోంది.
సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఈ సినిమా వసూళ్లు.. మరే సినిమా వసూళ్లకు అందనంత దూరంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దేశీయంగానే కాదు.. గ్లోబల్ బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిన ఆర్ఆర్ఆర్ కు నేపాల్ లోనూ తన హవా నడిపిస్తోంది.
సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు నేపాల్ లో రోజూ కోటి రూపాయిల (నేపాలీ కరెన్సీలో) కలెక్షన్లను సొంతం చేసుకుంటూ.. వారంలో ఏడు కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్న తొలి సినిమాగా నిలిచింది. మన రూపాయితో నేపాల్ రూపాయి మారకాన్ని చూస్తే.. మన రూపాయికి నేపాల్ రూపాయి 1.60 పైసలు వస్తాయి.
ఇంత భారీ వసూళ్లు నేపాల్ దేశ చరిత్రలో ఇప్పటివరకు మరే మూవీకి రాలేదని అక్కడి బాక్సాఫీస్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక.. హిందీలో ఇప్పటికే రూ.100 కోట్ల మార్కును అందుకున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పాటు.. దక్షిణాది రాష్ట్రాల్లోనూ వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.
This post was last modified on March 31, 2022 9:58 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…