మూడు నెలల కిందట ‘అఖండ’ రిలీజ్ టైంలో #Boycottbollywood అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవడం చర్చనీయాంశం అయింది. ఈ హ్యాష్ ట్యాగ్ చూసి సౌత్ వాళ్లే బాలీవుడ్‌కు వ్యతిరేకంగా ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు వేస్తున్నారని అనుకున్నారు చాలామంది. కానీ వాస్తవం ఏంటంటే.. ఆ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసింది, దాని మీద వేలల్లో ట్వీట్లు వేసింది ఉత్తరాది జనాలే.
ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్ ఫిలిం మేకర్స్.. హిందూ సంప్రదాయాలను కించపరుస్తూ, వివాదాస్పద సన్నివేశాలతో హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ‘పీకే’, ‘లుడో’ లాంటి సినిమాల్లో.. ‘తాండవ్’ లాంటి వెబ్ సిరీస్‌ల్లో హిందూ దేవుళ్ల, సంప్రదాయాలను కించపరిచేలా సన్నివేశాలు పెట్టడంపై గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బాలీవుడ్ తీరు ఇలా ఉంటే.. దక్షిణాది చిత్రాల్లో హిందూ దేవుళ్లను, సంప్రదాయాలను గొప్పగా చూపిస్తున్నాని నార్త్ ఇండియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘అఖండ’ సినిమాలో బాలయ్య చేసిన పాత్ర వారికి విపరీతంగా నచ్చేసింది. అందులో హిందూ దేవుళ్లు, ఆలయాలు, సంస్కృతి సంప్రదాయాల గురించి గొప్పగా చెప్పడం.. క్లైమాక్స్‌లో శివతాండవాన్ని కళ్లు చెదిరేలా చూపించడం పట్ల అక్కడి జనాలు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ పాత్రలో వారు రాముడిని చూసుకున్నారు.
దీంతో పాటు బాహుబలి సహా పలు చిత్రాల్లో హిందూ దేవుళ్లను గొప్పగా చూపించడాన్ని వాళ్లు కొనియాడుతూ.. అదే సమయంలో ఇందుకు భిన్నంగా సినిమాలు తీసే హిందీ ఫిలిం మేకర్స్‌ను తప్పుబడుతూ బాలీవుడ్‌కు వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు నార్త్ నెటిజన్లు. ఆమిర్ ఖాన్ సహా పలువురు హీరోల తీరును ఈ సందర్భంగా దుయ్యపడుతున్నారు. తాజాగా రణబీర్ కపూర్, ఆలియా కలిసి ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్ కోసం హిందూ ఆలయాల చుట్టూ తిరుగుతుండటాన్ని ఎద్దేవా చేస్తున్నారు.
This post was last modified on March 30, 2022 11:08 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…