ఈరోజుల్లో సినిమా హిట్టు కొట్టినా కూడా లైమ్ లైటులో ఉంటారో లేదో చెప్పలేం కాని, సోషల్ మీడియా పేజీల్లో కనిపించకపోతే మాత్రం క్రేజ్ తగ్గిపోయింది అనుకుంటున్నారు జనాలు. అందుకే రోజూ ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక పోస్ట్, ఏదో ఒక వీడియో, షార్ట్స్, రీల్స్ అంటూ అలరిస్తున్నారు అందాల భామలు. కాకపోతే అలా చేయాలంటే కూడా సమంత తరహాలో ఒక స్ట్రాటజీ ఉండాలి. ఇప్పుడు దానిని కూడా బీట్ చేస్తోంది బాలీవుడ్ భామ జాన్వి కపూర్.
ఒకప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అంటే ఎలా చెయ్యాలో జనాలకు నేర్పించింది సమంత. రోజు విడిచి రోజైనా సరే, తన అందచందాలను ఆరబోస్తూ ఏదో ఒక ఫోటో షూట్ తో విరుచుకుపడేది. అయితే ఫ్యాషన్ డ్రస్సుల్లో సొగసలు దారబోయడం, లేకపోతో వర్కవుట్ వీడియోలు పెట్టడం, లేదంటే ఏదన్నా కరెంట్ ఎఫైర్స్ పై ఘాటైన కామెంట్ చేయడమే సమంత పని అన్నట్లుండేది. ఇప్పటికీ సమంత అదే ప్యాట్రన్ కంటిన్యూ చేస్తున్నా కూడా, ఫోటోషూట్లు మాత్రం బాగా తగ్గించింది. కాని శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి మాత్రం.. రోజూ ఏదో ఒక కొత్త ఫోటోలతో విరుచుకుపడుతోంది. మాల్డీవ్స్ నుండి బికినీ ఫోటోలు పెట్టడం, లేదంటో ఫ్యాషన్ డిజైనర్లకు ఫోజులిచ్చి ఆ కొత్త డ్రస్సుల్లో అందాల విందు చేయడం అన్నట్లుంది జాన్వి పరిస్థితి.
ఇప్పటికీ సరైన హిట్టు ఒక్కటి కూడా కొట్టని ఈ కపూర్ పిల్ల.. ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం అన్నీ హిట్లే కొడుతోంది. తన అందాలతో కుర్రకారును క్లీన్ బౌల్డ్ చేస్తోంది. ఆ అందాల మోత ఏ రేంజులో ఉందంటే.. ఆల్రెడీ ఇన్‌స్టాలో అమ్మడికి 16 మిలియన్స్ ఫాలోవర్స్ అయిపోయారు. ఓ పదేళ్ళు భారీగా కష్టపడి 20 మిలియన్స్ ఫాలోవర్లను సమంత సంపాదిస్తే.. జాన్వి మాత్రం చాలా తక్కువ కాలంలో సమంత స్ట్రాటజీ వాడేసి.. సమంతకంటే పెద్దగా మోత మోగిస్తోంది.
This post was last modified on March 29, 2022 4:59 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…