కరోనా భయం వెంటాడుతున్నా.. లాక్ డౌన్ షరతులు కొనసాగుతున్నా.. టాలీవుడ్లో పెళ్లి సందడి ఏమీ ఆగట్లేదు. కొన్నాళ్లు వేచి చూసి, ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ముందుగా దిల్ రాజు తన రెండో పెళ్లితో సినీ జనాల్లో భయాన్ని కొంచెం తగ్గించారు. ఆ తర్వాత నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కాడు. ఇంకో నెలన్నరలో దగ్గుబాటి రానా, మిహీకా బజాజ్‌ల పెళ్లి కూడా జరగబోతోంది. ఆపై నితిన్ పెళ్లికి కూడా డేట్ ఫిక్సయ్యే అవకాశముంది. ఈలోపు కొత్తగా కొణిదెల నిహారిక కూడా పెళ్లి రేసులోకి వచ్చింది.
త్వరలోనే నిహారిక పెళ్లి చేయబోతున్నట్లు ఈ మధ్యే ప్రకటించిన నాగబాబు.. సంబంధం కుదిర్చేశారు. గుంటూరుకు చెందిన చైతన్య జొన్నలగడ్డను నిహారిక పెళ్లి చేసుకోబోతోంది. చైతన్య తాతతో చిరంజీవి తండ్రి వెంకట్రావుకు మంచి స్నేహం ఉందని.. ఇరు కుటుంబాల మధ్య ఎప్పట్నుంచో స్నేహం ఉందని.. ఈ నేపథ్యంలోనే సంబంధం కుదిరిందని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. నిహారిక పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అన్న చర్చ నడుస్తోంది టాలీవుడ్లో. అందుకు అవకాశం లేదన్నది సన్నిహిత వర్గాల సమాచారం. నిహారిక సినిమాల్లోకి రావడమే కొంచెం కష్టంగా జరిగింది. నాన్న, పెదనాన్న సహా అందరినీ కష్టపడి ఒప్పించి తెరంగేట్రం చేసిందామె. కానీ ఎంత ప్రయత్నించినా ఆమె కథానాయికగా సక్సెస్ కాలేదు.
మూడు సినిమాలు చేస్తే మూడు డిజాస్టర్లే అయ్యాయి. తమిళంలో నటించిన ఓ సినిమా కూడా తుస్సుమంది. ఎంత ఫ్యామిలీ బ్యాకప్ ఉన్నా కూడా.. వరుసగా ఫెయిల్యూర్లు వస్తే కెరీర్ ముందుకు సాగడం కష్టం. ఇప్పటికే నిహారిక తెలుగులో ఏ సినిమా చేయట్లేదు. తమిళంలో మాత్రం అశోక్ సెల్వన్ సరసన ఓ సినిమా ఒప్పుకుంది. షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యాక ఆ సినిమాను పూర్తి చేసి పెళ్లి పీటలు ఎక్కేయనుంది నిహారిక.
సరదాగా వెబ్ సిరీస్‌ల్లాంటివేమైనా చేస్తే చెయ్యొచ్చు కానీ.. పెళ్లి తర్వాత నిహారిక సినిమాలు చేయడం మాత్రం కష్టమే అని తెలుస్తోంది. హీరోయిన్‌గా సక్సెస్ అయి ఉన్నా భవిష్యత్తులో సినిమాలు చేయడం గురించి ఆలోచించేదేమో కానీ.. ఎలాగూ ఫెయిల్యూరే కాబట్టి ఆమె ఆ దిశగా ఆలోచించదనే అంటున్నారు.
This post was last modified on June 21, 2020 10:01 pm
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…