మిషన్ ఇంపాజిబుల్.. ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న చిన్న చిత్రం. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ వావ్ అనే అనుకున్నారు. ప్రభుత్వ రివార్డ్ కోసం దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు చిన్న పిల్లోళ్లు సాహసం చేసే నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ పాయింటే ట్రైలర్లో అందరి దృష్టినీ ఆకర్షించింది.
ట్రైలర్లో మిగతా అంశాలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో ఆశ్చర్యపరిచిన యువ దర్శకుడు స్వరూప్ నుంచి వస్తున్న కొత్త సినిమా కావడంతో ఇది కొత్తగా ఉంటుందని, మంచి వినోదాన్ని అందిస్తుందని ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. కాకపోతే ఈ సినిమాకు సరైన రిలీజ్ డేటే కుదరలేదు. వేసవి మొత్తం ప్యాక్ అయిపోయి ఉండగా.. భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ తర్వాతి వారంలో రావడానికి వేరే చిత్రాలు భయపడుతున్న సమయంలో ఈ చిత్రానికి డేట్ ఫిక్స్ చేశారు.
ఐతే ఇది ప్లస్సో మైనస్సో అర్థం కాని పరిస్థితి నెలకొంది.కొత్తగా వేరే సినిమాలేవీ పోటీలో లేకపోవడం ‘మిషన్ ఇంపాజిబుల్’కు కలిసొచ్చే విషయమే. కానీ కొత్త సినిమాలు లేకున్నా ముందు వారం రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ తాకిడిని తట్టుకోవడం ఈ చిన్న సినిమాకు తేలిక కాదు. ‘ఆర్ఆర్ఆర్’ ఊపు చూస్తుంటే.. రెండో వీకెండ్లో కూడా వసూళ్ల మోత మోగించేలా ఉంది. మెజారిటీ స్క్రీన్లలో ఆ సినిమాను కొనసాగించబోతున్నారు. ‘మిషన్ ఇంపాజిబుల్’కు ఓ మోస్తరు సంఖ్యకు మించి స్క్రీన్లు దక్కకపోవచ్చు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు ఈ సినిమాను ప్రదర్శించడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. ఐతే ఈ సినిమా స్థాయికి ఎన్ని స్క్రీన్లు దక్కాయన్నది ముఖ్యం కాదు.
సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చింది అందుబాటులో ఉన్న స్క్రీన్లలో ఎంత ఆక్యుపెన్సీ వచ్చింది అన్నది కీలకం. చూస్తుంటే అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే ఆదరిస్తారనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే టికెట్ల రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి మంచి టాక్ వస్తే యువత, కొంతమేర ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరించే అవకాశముంది. చూద్దాం మరి ఈ చిన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ పోటీని తట్టుకుని ఏమాత్రం నిలబడుతుందో?
This post was last modified on March 29, 2022 1:21 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…