మన దగ్గర ఒక హీరోకు 50 దాటితే కాస్త కష్టమే. రజనీకాంత్ లేదా చిరంజీవి రేంజ్ స్టార్లయితే తప్పించి.. సిక్ట్సీ దాటిందంటే మాత్రం మెయిన్ లీడ్ గా రిటైర్మంటే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. హీరోయిన్లకు అయితే 35 దాటింది అంటేనే రోల్స్ ఎగిరిపోతాయ్. ఇక 50 ఏళ్ళు దాటిన డైరక్టర్లు చాలామంది చాదస్తంతో కూడిన సినిమాలు తప్పించి, సెన్సిబుల్ సినిమాలను బ్లాక్ బస్టర్లను రూపొందించడం చాలా అరుదే. మ్యూజిక్ డైరక్టర్లు కూడా 50 దాటిందంటే మాత్రం రొటీన్ రంబోలా అయిపోతుంటారు. కాని హాలీవుడ్లో అలా కాదు.
ఈరోజు జరిగిన ఆస్కార్స్ 2022 పండగ చూస్తే.. అవార్డులు గెలిచినోళ్ళలో చాలామంది వృద్దులే. మన ఫిలిం ఇండస్ట్రీలో రిటైర్ అయిపోతారు అనుకునే వయస్సుకు అక్కడ రియల్ టాలెంట్ చూపించడం మొదలెడతారని అవార్డులు గెలిచినోళ్ళని చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.
ది పవర్ ఆప్ ది డాగ్ సినిమాకు బెస్ట్ డైరక్టర్ అవార్డు గెలుచుకున్న జేన్ క్యాంపియన్ వయస్సు 67 ఏళ్ళు. డ్యూన్ సినిమాకుగాను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు దక్కించుకున్న సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ వయస్సు 64 ఏళ్ళు. ఉత్తమ ఒరిజినల్ స్ర్కిన్ ప్లే అవార్డు అందుకున్న కెనెత్ బ్రనాగ్ వయస్సు 61 ఏళ్లు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు గెలిచిన ట్రాయ్ కొట్సుర్ ఏజ్ 54 ఏళ్ళు. డ్యూన్ సినిమా జోయ్ వాకర్ 68 ఏళ్ళకు బెస్ట్ ఎడిటర్ అవార్డు తీసుకున్నాడు. ఏ విధంగా చూసినా కూడా 50 దాటిన తరువాత, వాళ్ళకున్న ఎక్సపీరియన్స్ కారణంగా.. హాలీవుడ్లో చాలామంది బెటర్ సినిమాలను అందిస్తున్నారు. మరి మన దగ్గర పరిస్థితి ఏంటి?
నిజానికి మన దగ్గర 50 దాటిన డైరక్టర్లకు, రైటర్లకు, ఇతర టెక్నీషియన్లకు చాదస్తం పెరిగిపోతోందనేది ఒక వాదన. నిజానికి వీళ్ళు కూడా 50 దాటగానే చేసిన ప్రాజెక్టులన్నీ ఘోరంగానే ఉంటున్నాయి. ఉదాహరణకు కె.విశ్వనాథ్, కృష్ణవంశీ వంటి టాలెంటెడ్ దర్శకులు.. 50 దాటాక మాత్రం దారుణమైన సినిమాలనే తీశారు. అలాగే వయసైపోయిన మ్యూజిక్ డైరక్టర్లు కూడా పేలవమైన వర్కే చేస్తున్నారు. మరి హాలీవుడ్ ను చూసి ఈ విషయంలో మనోళ్ళు కాస్త ఇనస్పయిర్ అయితే బెటరేమో. ఇక యాక్టర్లు మాత్రం ఇండియాలో కూడా ఈ మధ్యనే 50 దాటాక కొత్త స్టార్డమ్ కూడా మూటకట్టుకుంటున్నార్లే.
This post was last modified on March 28, 2022 6:45 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…