కమల్ ఆర్.ఖాన్ అని హిందీలో ‘ఫేమస్ క్రిటిక్’. ఇతని గురించి తెలిసిన వాళ్లకు ‘ఫేమస్ క్రిటిక్’ అన్న మాట రుచించకపోవచ్చు. ఎందుకంటే ట్విట్టర్లో అతను వేసే చిల్లర వేషాల గురించి వాళ్లందరికీ బాగా తెలుసు. కానీ ఈ పిచ్చి చేష్టలతోనే 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడతను. సోషల్ మీడియాలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ల కంటే అతి చేసే, చీప్ ట్రిక్స్ ప్లే చేసే వాళ్లకే ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది మరి.
ఏ కొత్త సినిమా రిలీజైనా పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలతో హాట్ టాపిక్ అవడానికి ప్రయత్నిస్తుంటాడతను. సల్మాన్ ఖాన్ తన సినిమాకు రివ్యూ ఇవ్వొద్దని వేడుకున్నాడని.. కరణ్ జోహార్ సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చినందుకు తనపై విరుచుకుపడ్డాడని.. ఇలా అతను వేసే వేషాలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి బాలీవుడ్ వాళ్లు ఇతణ్ని లైట్ తీసుకోవడం మొదలై చాలా కాలమైంది.
అతను మాత్రం తన స్టైల్‌ను అలాగే కొనసాగిస్తున్నాడు.అప్పుడప్పుడూ సౌత్ సినిమాల మీద కూడా పడి ఏడ్చే కమల్ ఆర్ ఖాన్.. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ను టార్గెట్ చేసుకున్నాడు. ఈ సినిమాకు అతను జీరో రేటింగ్ ఇచ్చాడు. ఇదొక చెత్త సినిమా అని పేర్కొన్నాడు. ‘బాహుబలి’ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి రాజమౌళి చూశాడని.. ఏవేవో సినిమాలను కాపీ కొట్టి సన్నివేశాలు తీశాడని.. ఇదొక నాసిరకం సినిమా అని అన్నాడు. అంతే కాక హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల గురించి కూడా అవాకులు చెవాకులు పేలాడు. అంతటితో ఆగకుండా సౌత్ సినీ అభిమానులంతా వేస్ట్ అన్నట్లు కూడా మాట్లాడాడు.
ఇక ఆటోమేటిగ్గా మన నెటిజన్లు అతడి మీద విరుచుకుపడిపోవడం, అతను ట్రెండ్ అయ్యేలా చూడటం, తన పాపులారిటీ పెరగడం మామూలే. కమల్ కోరుకునేది కూడా ఇదే. ఇలాగే చాన్నాళ్ల నుంచి చేస్తున్నాడు. గతంలో అతడి వేషాలు శ్రుతి మించి ఒకసారి అకౌంట్ రద్దయింది కూడా. అయినా మళ్లీ కొత్త అకౌంట్ తెరిచి ఇంతమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. మరి ఈ చీప్ ట్రిక్స్ ఇంకా ఎంత కాలం పని చేస్తాయో చూడాలి మరి.
This post was last modified on March 27, 2022 7:10 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…