పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్‌ను విస్తరించడానికి ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్లందరూ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాలకు విశేష ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో మన సూపర్ స్టార్లందరూ ఇండియా అంతటా తమ చిత్రాలను రిలీజ్ చేయడానికి ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఆల్రెడీ ‘బాహుబలి’తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ ‘పుష్ప’తో నేషనల్ లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు.
‘ఆర్ఆర్ఆర్’తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం ఇలాంటి ఇమేజే సంపాదిస్తారని అంచనా వేస్తున్నారు. ఐతే ఈ హీరోల్లా పవన్ కళ్యాణ్‌కు సరైన ప్లానింగ్ లేని మాట వాస్తవం. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రమోషన్ లేకుండా తన సినిమాలను హిందీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
ఇంతకుముందు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి పేలవమైన చిత్రాన్ని హిందీలో సరైన ప్రమోషన్ లేకుండా రిలీజ్ చేశాడు. దానికి రిలీజ్ ఖర్చులు కూడా రాలేదు. ఇప్పుడేమో ‘భీమ్లా నాయక్’ లాంటి రీమేక్ మూవీని అక్కడి తీసుకెళ్లాలని చూశాడు. దీని విషయంలోనూ ప్లానింగ్, ప్రమోషన్ లేకపోయింది. ముందు తెలుగు వెర్షన్‌తో పాటే హిందీలో రిలీజ్ చేయాలనుకున్నారు. కుదరలేదు. తర్వాతేమో ముందు తెలుగు వెర్షన్‌ను ఇక్కడ రిలీజ్ చేసేసి.. రెండు వారాల గ్యాప్‌లో హిందీ రిలీజ్ అనుకున్నారు. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రన్ ముగిశాక వేరుగా హిందీ ట్రైలర్ వదిలారు. రిలీజ్‌కు సన్నాహాలు చేశారు.
కానీ ఏం జరిగిందో ఏమో.. అనుకున్న సమయానికి హిందీలో రిలీజ్ చేయలేకపోయారు. ‘కశ్మీర్ ఫైల్స్’ ప్రభంజనం సాగుతుండగా.. ‘భీమ్లా నాయక్’ను ఏం పట్టించుకుంటారని వెనక్కి తగ్గారో ఏమో తెలియదు. ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’ హంగామా మొదలైంది. ఈ చిత్రం ఉండగా ఇంకో సౌత్ మూవీని ఆదరించే అవకాశమే లేదు. ఓటీటీలో ‘భీమ్లా నాయక్’ అందుబాటులోకి వచ్చేస్తుండటంతో ఇక హిందీ వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ గురించి మరిచిపోవాల్సిందేనేమో. వేరే స్టార్లంతా పాన్ ఇండియా హీరోలుగా ఎదిగిపోతుంటే.. పవన్ సినిమాలకు హిందీలో ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవడం అభిమానులకు రుచించడం లేదు.
This post was last modified on March 23, 2022 6:48 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…