సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, జోక్స్‌ను సెలబ్రెటీలు పెద్దగా పట్టించుకోరనే అనుకుంటారు చాలామంది. వాళ్లుండే బిజీకి తోడు మీమ్స్‌లో తమ మీద వేసే పంచులను తట్టుకోలేరనే భావిస్తారు. కానీ మారుతున్న కాలానికి తగ్గట్లు అప్ టు డేట్‌గా ఉండాలంటే సోషల్ మీడియా ట్రెండ్స్ తెలుసుకుంటూ ఉండాలి. అందులో మీమ్స్, జోకులను ఫాలో అవుతూ ఉండాలి.
సెలబ్రెటీలకంంటూ ఎంటర్టైన్మెంట్ ప్రత్యేకంగా ఏమీ ఉండదు కాబట్టి, వాళ్లు కూడా మన లాంటి మనుషులే కాబట్టి ఫన్ కోసం సోషల్ మీడియాను, అందులో వచ్చే మీమ్స్‌ను అనుసరించక తప్పదు. ఈ విషయంలో మిగతా హీరోల కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా ముందున్నాడని.. సోషల్ మీడియా ట్రెండ్స్ తెలుసుకోవడంలో అతనికి అతనే సాటి అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా తన టీంతో కలిసి పాల్గొన్న అనేక ఇంటర్వ్యూలో తారక్ వివిధ చిత్రాల్లోని పాపులర్ డైలాగులను గుర్తు చేస్తూ సమయోచితంగా వేసిన పంచులు హైలైట్. ‘వెంకీ’ సినిమాలో మాస్టర్ భరత్ చెప్పే ‘నాకు ఆ కూల్ డ్రింకే కావాలి’.. ‘నేనింతే’ మూవీలో రవితేజ చెప్పిన ‘ఏంటి సార్ అది’.. ఇంకా కింగ్ మూవీలో ‘ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది’.. ‘ఐయామ్ టెల్లింగ్ దట్’.. ఇంకా లేటెస్ట్ హిట్ ‘డీజే టిల్లు’లోని ‘అట్లుంటది మనతోని’… ఈ డైలాగులన్నింటినీ అనుకరిస్తూ సమయానుకూలంగా అదిరిపోయే పంచులు వేశాడు తారక్.
మామూలుగా మీమర్స్ ఇలాంటి పంచ్ డైలాగుల్ని తీసుకుని మీమ్స్ క్రియేట్ చేస్తుంటారు. వాళ్ల కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో యువత కూడా ఇదే టైమింగ్‌తో కామెడీ పండిస్తుంటుంది. ఐతే ఎన్టీఆర్ స్థాయి హీరో కూడా మామూలు కుర్రాళ్ల లాగే ఆలోచిస్తూ మీమర్స్ తరహాలో పంచ్ డైలాగులు పేల్చుతూ ఇంటర్వ్యూల్లో కామెడీ పండించడం ఇక్కడ విశేషమే. ఈ నేపథ్యంలో అన్న కూడా మనలాంటోడేరా అంటూ ఇంటర్వ్యూల్లో తారక్ పంచ్ డైలాగులతో ఒక వీడియో రూపొందించి.. జూనియర్ రాముడికి డెడికేట్ చేశారు మీమర్స్.
This post was last modified on March 22, 2022 9:16 pm
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…
నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్…
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…