మన దర్శక ధీరుడు రాజమౌళి పర్ఫెక్షన్ కోసం ఎంత తపిస్తాడో ఆయన సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. ఒక సన్నివేశమైనా, ఒక ఫైట్ అయినా, ఒక డ్యాన్స్ మూమెంట్ అయినా.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా రావడం కోసం ఎన్ని టేకులైనా తీసుకుంటాడని.. ఈ క్రమంలో ఆర్టిస్టులను రాచి రంపాన పెడతాడని ఆయనకు పేరుంది.
ఈ అనుభవాల గురించి చాలామంది నటీనటులు, టెక్నీషియన్లు ఆయన పెట్టే టార్చర్ గురించి సరదాగా చెబుతుంటారు. ఇక రాజమౌళికి బాగా క్లోజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి మీద చేసిన కంప్లైంట్లు అన్నీ ఇన్నీ కావు. ‘నాటు నాటు’ పాటలో హుక్ స్టెప్ కోసం కొన్ని వారాల పాటు ప్రాక్టీస్ చేసిన ఎంతో పర్ఫెక్ట్‌గా ఆ మూమెంట్ చేస్తే.. 17 టేక్‌లు తీసుకున్నట్లు తారక్ చెప్పడం గమనార్హం.
ఇన్ని టేక్‌లు తీసుకుని చివరికి రెండో టేక్‌నే ఓకే చేసేశాడట జక్కన్న.ఇదంతా ఒక ఎత్తయితే.. ముంబయిలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ కోసం కూడా తమను జక్కన్న పెట్టిన కష్టం అంతా ఇంతా కాదంటూ ఒక సీక్రెట్ వెల్లడించాడు. ఈ ఈవెంట్లో భాగంగా గాల్లోంచి తారక్ బుల్లెట్ మీద, చరణ్ గుర్రం మీద దిగడం ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. ప్రమోషన్లలో ఇది ఇంకో లెవెల్ అంటూ అందరూ దీన్ని కొనియాడారు. ఐతే ప్రేక్షకులు చూసిన ఈ దృశ్యం ‘రియల్’ లొకేషన్లో జరిగింది కాదని తారక్ చెప్పాడు.
చాలా రోజుల పాటు రిహార్సల్స్ చేసి ముంబయిలో ఈవెంట్ జరిగిన ప్రదేశంలో నిజంగానే గాల్లో గుర్రం, బుల్లెట్ల మీద చరణ్, తారక్ దిగడం వాస్తవమేనట. కానీ ఈవెంట్ పూర్తి చేసుకుని విమానంలో తిరిగి వస్తున్న టైంలో రాజమౌళి తనయుడు కార్తికేయ.. పెద్ద బాంబు పేల్చాడని, లైటింగ్ సరిగా లేక ఈ దృశ్యం అనుకున్నంత బాగా రాలేదన్నాడని.. దీంతో విజువల్స్ చూసేటపుడు ప్రేక్షకులు నిరాశ పడతారనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో అచ్చం అలాంటి సెట్టే వేసి ఈ దృశ్యాన్ని మళ్లీ షూట్ చేశారని.. ఒరిజినల్ వీడియోలో ఆ మూమెంట్ దగ్గర దీన్ని రీప్లేస్ చేశారని.. ఇలా జక్కన్న ప్రేక్షకులకు అది ఒరిజినల్ లొకేషన్లో జరిగినట్లుగా భ్రమ కల్పించాడని తారక్ వెల్లడించాడు. రాజమౌళి పర్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో, ఇందుకోసం ఆర్టిస్టులను ఎంత కష్టపెడతాడో ఉదాహరణగా దీన్ని చూపించాడు తారక్.
This post was last modified on March 22, 2022 4:54 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…