పెద్ద హీరోలు నటించిన కొత్త సినిమాలు రిలీజైనపుడు థియేటర్ల ముందు, లోపల అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఐతే ఈ హంగామా కొన్నిసార్లు మరీ శ్రుతి మించిపోతుంటుంది. సీట్లు విరిగిపోతుంటాయి. స్క్రీన్లు కూడా చిరిగిపోతుంటాయి. రాను రాను ఈ కల్చర్ మరీ ఎక్కువైపోయి.. స్క్రీన్ ముందు డయాస్ మీదికి పదుల సంఖ్యలో అభిమానులు వెళ్లి తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితికి వెళ్తుండటంతో విధ్వంసాలు జరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ శుక్రవారం భారీ అంచనాల మధ్య రిలీజవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించబోతున్న థియేటర్లు అప్రమత్తం అవుతున్నాయి. అభిమానులు హద్దులు దాటడానికి వీల్లేకుండా థియేటర్ల లోపల పొలాల చుట్టూ వేసే తరహా కంచెలు ఏర్పాటు చేయడం, అలాగే డయాస్ మీద మేకులు అమర్చిన చెక్కల్ని సెట్ చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
థియేటర్ల లోపల ఇలాంటి ఏర్పాట్లూ నభూతో అనే చెప్పాలి. మామూలుగా ఒక పెద్ద హీరో సినిమా అంటేనే థియేటర్లలో అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. పైగా ఆర్ఆర్ఆర్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు టాప్ స్టార్లు నటించారు. పైగా ఇది రాజమౌళి సినిమా. దీనిపై అంచనాలు మామూలుగా లేవు.
బయట తారక్, చరణ్ ఫ్యాన్స్ ఎవరికి వాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటడానికి ప్రయత్నిస్తున్న వైనం చూస్తున్నదే. అలాంటిది సినిమా రిలీజైనపుడు ఇరువురి అభిమానులు పోటాపోటీగా హడావుడి చేయడం గ్యారెంటీ. ఈ క్రమంలో థియేటర్లలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. అందుకే థియేటర్ల యాజమాన్యాలు ఇలాంటి జాగ్రత్తల్లో పడుతున్నట్లు అర్థమవుతోంది. విజయవాడ సహా ఏపీలో పలు థియేటర్లలో ఇలాంటి ఏర్పాట్లే జరుగుతున్నాయి.
This post was last modified on March 22, 2022 11:46 am
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…
నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్…
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…