ఈమధ్య కీర్తి సురేష్ పేరు వార్తల్లో బాగా వినిపించింది. కీర్తి ప్రేమలో పడిందని, ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ నేత కుమారుడిని ప్రేమిస్తోందని, పెద్దలు కూడా వీళ్ల ప్రేమని అంగీకరించి, పెళ్లికి ఒప్పుకున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతోందని.. ఇలా రకరకాల వార్తలొచ్చాయి. వీటిపై కీర్తి స్పందించింది కూడా. ప్రేమ – పెళ్లి విషయాల గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని క్లారిటీ ఇచ్చింది. దాంతో ఇవన్నీ కేవలం గాసిప్పులే అనుకున్నారంతా.
నిజానికి… కీర్తి ప్రేమ కథల్లో వాస్తవం లేకపోలేదని టాక్. కీర్తి ప్రేమలో పడిందన్న మాట నిజమే అని, కానీ.. ఆ విషయాన్ని కీర్తి దాచే ప్రయత్నం చేస్తోందని, ముందు తన చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి, అప్పుడు తన ప్రేమికుడ్ని ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తోందని చెప్పుకుంటున్నారు.
నాగచైతన్య – సమంత ప్రేమలో ఉన్నప్పుడు కూడా.. ఈ విషయాన్ని చాలా కాలం దాచారు. సడన్‌గా ఓ రోజు కుండ బద్దలు కొట్టారు. కీర్తి కూడా ఇప్పుడు అలానే చేయబోతోందట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే… ఇంకొంత కాలం ఆగాలి.
This post was last modified on June 19, 2020 4:31 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…