టాలీవుడ్లో చాలా తక్కువ సమయంలో చాలా పెద్ద స్టార్‌గా ఎదిగిన నటుడు విజయ్ దేవరకొండ. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు.. ‘గీత గోవిందం’ రిలీజ్ టైంలో విజయ్‌కు వచ్చిన క్రేజ్ చూసి, తాను స్టార్ అవ్వడానికి చాలా ఏళ్లు పట్టిందని, కానీ విజయ్ చాలా తక్కువ టైంలో పెద్ద స్టార్ అయిపోయాడని అనడం అతడి ఎదుగుదలకు నిదర్శనం. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో అతడి క్రేజ్ విస్తరించింది.
ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్‌తో ‘లైగర్’ లాంటి పాన్ ఇండియా మూవీ చేశాడు. హిందీలో కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఈ చిత్రంలో భాగస్వామి అయ్యాడు. ‘లైగర్’ అంచనాలకు తగ్గట్లు ఉంటే విజయ్ కెరీర్ ఇంకో స్థాయికి వెళ్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికి విజయ్ కెరీర్ సంతృప్తికరంగానే సాగుతున్నప్పటికీ.. అతను ఫామ్‌లో ఉన్న పెద్ద డైరెక్టర్లతో పని చేస్తే ఇంకా పెద్ద రేంజికి వెళ్తాడన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది.
పూరి జగన్నాథ్‌తో వరుసగా రెండో సినిమా చేస్తున్నప్పటికీ.. ఆయన ఫామ్ గురించి అందరికీ తెలిసిందే. ఇంతకుముందు ప్రకటించిన సుకుమార్ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని విజయ్ ఫ్యాన్స్ చూస్తున్నారు. ఐతే ఈ ప్రాజెక్టుపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ప్రకటించి రెండేళ్లు కావస్తున్నా దీని గురించి కొత్త కబుర్లేమీ వినిపించడం లేదు. ‘పుష్ప-2’ తర్వాత సుక్కు రామ్ చరణ్‌తో సినిమా చేసేలా కనిపిస్తున్నాడు తప్ప.. విజయ్‌తో కమిట్మెంట్‌ను నెరవేర్చేలా కనిపించడం లేదు. ఇలాంటి టైంలో విజయ్‌తో మరో టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తుండటం విశేషం.
తన దగ్గరికి వస్తున్న కొత్త కథలు వినడానికి విజయ్ ఆసక్తి చూపించట్లదేట. తనకున్న కమిట్మెంట్ల లిస్ట్ చూపించి.. ఇప్పుడిప్పుడే కొత్త సినిమా ఏదీ ఒప్పుకోలేనని అంటున్నాడట. అతడి లిస్టులో త్రివిక్రమ్ సినిమా కూడా ఉన్నట్లు చెబుతున్నట్లు సమాచారం. ఐతే ఈ సినిమా ఎప్పుడు, ఏ బేనర్లో తెరకెక్కుతుందన్నది తెలియదు కానీ.. త్రివిక్రమ్‌తో తనకు కమిట్మెంట్ ఉన్నట్లు విజయ్ సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలిసింది.
This post was last modified on March 21, 2022 4:12 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…