నేచురల్ స్టార్ నాని సరికొత్త అవతారంలోకి మారిపోయాడు ‘దసరా’ సినిమా కోసం. ఈ చిత్రం ప్రి లుక్ పోస్టర్ రిలీజ్ చేసినపుడే ఇదొక రా అండ్ రస్టిక్ ఫీల్ ఉన్న సినిమా అని అర్థమైపోయింది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని ఊర మాస్‌గా కనిపించబోతున్నాడన్న సంకేతాలు వచ్చాయి. ఇప్పుడు ‘దసరా’ ఫస్ట్ లుక్ చూశాక ఆ అభిప్రాయం మరింత బలపడింది.
ఐతే ఈ ఫస్ట్ లుక్ చూసిన వాళ్లందరికీ కళ్ల ముందు ఒకసారి ‘పుష్ప’ సినిమా కదలాడి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. లుక్ పరంగా నాని కొత్త మేకోవర్ కోసం చాలా కష్టపడ్డప్పటికీ.. చివరికి పుష్పరాజ్‌ను తలపించే లుక్‌లోకే వచ్చాడు. తన జుట్టు, గడ్డం, లుంగీ.. ఇలా మొత్తం గెటప్ ‘పుష్ప’లో అల్లు అర్జున్ లుక్‌కు చాలా దగ్గరగా ఉంది. ఒక హీరో ఒక కొత్త లుక్ ట్రై చేశాక దానికి దగ్గరగా ఏ లుక్ ఉన్నా కాపీ అన్నట్లే చూస్తారు. కొత్తగా ఫీలవ్వరు.
నానిని ఇంత మాస్ అవతారంలో చూడటం కొత్తగా అనిపించినప్పటికీ.. ‘పుష్ప’ ప్రభావం మాత్రం ఈ పోస్టర్లో స్పష్టంగా కనిపిస్తోంది. పైగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న శ్రీకాంత్ ఓదెల.. సుకుమార్ శిష్యుడు కావడం.. ‘రంగస్థలం’, ‘పుష్ప’ చిత్రాలకు అతను పని చేయడంతో గురువు ఇంపాక్ట్ శిష్యుడి మీద చాలా ఉందనే అభిప్రాయం బలపడుతోంది. ఐతే ‘పుష్ప’ రాయలసీమ నేపథ్యంలో నడిచే కథ కాగా.. ‘దసరా’ తెలంగాణ నేపథ్యంలో నడుస్తుంది.
ఈ రకంగా భాష, యాస, వాతావరణం పరంగా వైవిధ్యం తీసుకురావడానికి ఛాన్సుంది. కథ పరంగా కూడా శ్రీకాంత్ ఏమేర కొత్తగా ప్రయత్నిస్తాడో చూడాలి. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పడిపడి లేచె మనసు, విరాటపర్వం, ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రాల నిర్మాత సుధాకర్ చెరుకూరి ‘దసరా’ను నిర్మిస్తున్నాడు. తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.
This post was last modified on March 20, 2022 8:30 pm
కేశినేని బ్రదర్స్ మధ్య రాజుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణల వ్యవహారం ఏపీలో కలకలమే రేపుతోంది. పదేళ్ల పాటు విజయవాడ ఎంపీగా నాని…
ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తూ తనకో బ్లాక్ బస్టర్ ఇస్తాడని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మీద సూర్య పెట్టుకున్న నమ్మకం…
అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా…
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..…